శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 10 జులై 2016 (10:48 IST)

స్కిప్పింగ్‌తో బ్రెస్ట్ లూజ్ అవుతుందా? నిపుణులేమంటున్నారు?

చాలా మంది అమ్మాయిలు లావుగా ఉంటారు. ఇలాంటి వారు తమ లావును తగ్గించుకునేందుకు, కొవ్వు కరిగించుకునేందుకు వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు.

చాలా మంది అమ్మాయిలు లావుగా ఉంటారు. ఇలాంటి వారు తమ లావును తగ్గించుకునేందుకు, కొవ్వు కరిగించుకునేందుకు వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి బ్రెస్ట్ ఎక్సర్‌సైజ్ ఒకటి. దీన్ని చేయడం వల్ల బ్రెస్ట్ లూజ్ అవుతుందనే అపోహా చాలా మంది యువతుల్లో ఉంటుంది. దీనిపై నిపుణులను సంప్రదిస్తే.. 
 
సాధారణంగా స్కిప్పింగ్ చెయ్యడం వల్ల బ్రెస్ట్ లూజ్ కాదు. స్కిప్పింగ్ వల్ల బరువు తగ్గి, బ్రెస్ట్‌లో ఉండే కొవ్వు, దాని చుట్టూ ఉండే కొవ్వు కరగిపోతుంది. ఇలా కావడం వల్లే వక్షోజాలు కాస్తంత లూజుగా అయినట్టుగా అనిపిస్తాయి. దీంతో కంగారుపడాల్సిన అవసరం లేదు. రొమ్ములు బిగుతుగా అవ్వడానికి రెగ్యులర్‌గా వలయాకారంలో బ్రెస్ట్ మసాజ్ చేయించుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి, రొమ్ముల పటుత్వం పెరిగి, టైట్‌గా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని ఛాతీ వ్యాయామాలు చెయ్యడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.