మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?
బరువు తగ్గడానికి ప్రజలు అనేక మార్గాలు ప్రయత్నిస్తున్నారు. కఠినమైన ఆహారం పాటించేవారు, తీవ్రంగా వ్యాయామం చేసేవారు కొందరు ఉన్నారు. నాలుగు రోజులు వ్యాయామం చేసి ఎందుకు బరువు తగ్గలేదని ఆలోచించేవారు చాలామందే వుంటారు. అయితే మహిళలు త్వరగా బరువు తగ్గడానికి సులభమైన మార్గాలను ఎంచుకోవచ్చు. ఎలాగంటే.. ప్రతిరోజూ గంట సేపు నడవడం వల్ల బరువు తగ్గుతారు.
దానితో పాటు, కేలరీలు తక్కువగా గల ఆహారం తీసుకోవాలి. ప్రధాన విషయం ఏమిటంటే, తరచుగా ఒకే చోట కూర్చోకుండా లేదా పడుకోకుండా, శరీరాన్ని ప్రతిరోజూ చురుగ్గా ఉంచడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా దీర్ఘాయువుకు కూడా కీలకంగా మారుతుంది.
కేలరీల లోటు అంటే శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ కేలరీలు తినడం. బరువు తగ్గించే క్రమంలో కండరాల నష్టాన్ని నివారించడానికి పుష్కలంగా ప్రోటీన్ ఆహారాలు తీసుకోవాలి. ఇంకా బరువు తగ్గడానికి నడక ఒక అద్భుతమైన వ్యాయామం. ప్రతిరోజూ 1 గంట నడవడం వల్ల బరువు గణనీయంగా తగ్గుతుంది.
దీనివల్ల శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. నడుస్తున్నప్పుడు చేతులను బలంగా కదిలించడం కూడా మీ పై శరీర కండరాలకు మంచి వ్యాయామం.