గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (17:05 IST)

పాలిచ్చే తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలు..?

పాలిచ్చే తల్లులకు స్థనాలపైన చీముగడ్డలు వచ్చి అమితమైన బాధ కలిగిస్తాయి. పాలిండ్లు సున్నితమైన ప్రాంతం కావడంతో నొప్పి మరీ అధికంగా వుంటుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. దీనిని స్థన విద్రధి అని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో అంటారు.
 
స్థనాలపై ఏర్పడ్డ ఆ గడ్డలను కాస్త చీల్చి అందులోనున్న చీము, రక్తం, చెడ్డనీరు వంటివి బైటకు తీసివేయడమే దీనికి ప్రథమ చికిత్స అని వైద్యులు తెలిపారు. ఆ గడ్డలను కోసేస్తారనే భయంతో పాలిచ్చే తల్లులు వైద్యులను సంప్రదించక నొప్పి నివారణకు చెందిన మాత్రలు వాడుతారు. కాని ఆ గడ్డలను కోస్తారనే అపోహ ఏ మాత్రం వద్దని అంటున్నారు వైద్యులు. 
 
చిన్న గాటు పెట్టి లోపల చేరుకున్న చెడు పదార్థాన్ని తీసేస్తే బాధ క్షణాలలో తగ్గిపోతుందని, పుండు తగ్గగానే మళ్ళీ తన బిడ్డకు పాలిచ్చుకోవచ్చని వారు తెలిపారు. పుండు తగ్గేవరకు పాపాయికి పాలివ్వడం మానేయాలి. పాలిండ్లలోనున్న పాలను పిండేయడం కూడా మంచిదేనంటున్నారు వైద్యులు. దీంతో నొప్పికూడా తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.