అతినిద్ర ఆరోగ్యానికి హానికరమా..?
కొందరు భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమిస్తారు. దీనితో వారి జన్మధన్యమైనట్టు భావిస్తుంటారు. మరి కొందరైతే చదువుకోవాలనే నెపం ఉన్నప్పటికీ పుస్తకం పట్టీ పట్టగానే తూగుతూ నిద్రలోకి జారిపోతుంటారు. ఏదైనా పనిచేయాలని నిద్రమాని ఉత్సాహంగా ఉండాలనుకుని తిన్నవెంటనే ముసుగులోకి చేరి నిద్రపోతారు.
ఇలా అతినిద్రకు కారణం మెదడు పొరల్లో కనురెప్పలమాటున కొవ్వు తెరలు పేరుకొని ఉండడమేనని ఇందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలా కనురెప్పల మాటున కొవ్వు పేరుకుని ఉండడం వలన మెదడు అలసిపోతుంది. తద్వారా అతినిద్ర ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు.
ఈ సమస్యకు పరిష్కారం లభించాలంటే.. ప్రతి రోజూ రాత్రి నేలములక వేరులు తేనెతో చాది కల్కం వేసుకోవాలి. అలా చేసి నిమ్మరసం, తేనె వాడుతుంటే ఈ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.