శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (15:24 IST)

ఇంగువ, గోమూత్రాన్ని కలిపి తాగుతుంటే..?

బుద్ధి భ్రంశం, మానసిక చాంచల్యం, దేనిమీదా దృష్టి నిలకడగా ఉండకపోవడం, పిరికితనం, ఏదేదో మాట్లాడం, హృదయం శూన్యంగా అయిపోయినట్లు భావిస్తూ ఒంటరిగా కూర్చోవడం వంటి వన్నీ ఉన్మాద వ్యాధి లక్షణాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పైత్యం ప్రకోపించడం వలన ఈ వ్యాధి కలుగుతుంది. 
 
ఈ వ్యాధికి ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకు, బూడిద గుమ్మడికాయ, వస, తెల్లగంటెన.. వీటి రసాలలో దేనినైనా చెంగల్వకోష్ఠు చూర్ణాన్ని తేనెలో కలిపి రోజూ తీసుకున్నచో ఉన్మాద వ్యాధి తగ్గుతుంది. 
 
ఇంగువ, సౌవర్చలవణం, త్రికటుకములు.. వీటిలో ఆవు నెయ్యి... నేతిని నాలుగు రెట్లు గోమూత్రాన్ని కలిపి పక్వమయ్యే వరకూ కాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ త్రాగుతుంటే ఉన్మాద రోగం నయమవుతుంది. వల్లారి ఆకు లేదా నీరు సాంబ్రాణి ఆకురసం వసపొడి, చెంగల్వకోష్ఠు చూర్ణం, శంఖపుష్పి చూర్ణం, స్వర్ణభస్మం కలిపి తాగినచో ఉన్మాదం, అపస్మారకం తగ్గుతుంది.