శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chj
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (17:00 IST)

ఇలా చేస్తే మహిళలకు వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు...

శృంగారం అనే పదాన్ని ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇప్పటికీ పెద్ద బూతుగానే భావిస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులతో గాని, వైద్యులతో తమ సమస్యల గురించి చెప్పాలంటే మొహమాటం పడేవారు చాలామ

శృంగారం అనే పదాన్ని ముఖ్యంగా భారతీయ సమాజంలో ఇప్పటికీ పెద్ద బూతుగానే భావిస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులతో గాని, వైద్యులతో తమ సమస్యల గురించి చెప్పాలంటే మొహమాటం పడేవారు చాలామందే ఉంటారు. కానీ శృంగారమనేది ఆనంద సాగరం గురించి లోతుగా తెలుసుకుని ఆనందించి ఆస్వాదించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఎంతైనా ఉందని చెబుతున్నారు వైద్యులు. 
 
అసలు మహిళలు శృంగారంలో ఎందుకు పాల్గొనాలి. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో విపరీతమైన పోటీ వల్ల ఒత్తిడిని మానసిక వేదనను అనుభవిస్తూ మహిళలు ఎంతోమంది ఉన్నారు. దీనికి తోడు ఎన్నో సమస్యలను తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్నారు మహిళలు. వీటన్నింటి నుంచి మహిళలకు స్వాంతన చేకూర్చేందుకు శృంగారం ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. రతి క్రీడలో పాల్గొనడం వల్ల వివిధ రకాల హార్మోన్లు రకరకాల రసాయనాలను విడుదల చేస్తాయి. 
 
మనస్సును ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉంచడంలో శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒత్తిడిని, మానసిక వేధనను దూరం చేసి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. అంతే కాకుండా శృంగారంలో తరచూ పాల్గొనే మహిళల్లో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. శృంగారం వల్ల కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వారానికి ఒక్కసారైనా మహిళలు జీవిత భాగస్వామితో శృంగారంలో పాల్గొని పడకగది అనుభూతిని మనసారా ఆస్వాదిస్తే శరీరానికి ఎంతో మంచిదని, మనస్సు కూడా ఉల్లాసంగా ఉండడంతో పాటు జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా సులభంగా ఎదుర్కొంటారు. కాబట్టి మహిళలు శృంగారాన్ని ఏముందిలే అని అశ్రధ్థ చేయరాదు.