ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 16 మే 2017 (20:45 IST)

స్త్రీలకు వార్నింగ్... పురుషులు వాడాల్సినవి పక్కన పడేసి స్త్రీకి గర్భ నిరోధక మాత్రలా?

ఇప్పుడే పిల్లలు వద్దు అని చాలామంది జంటలు పెళ్లయిన తర్వాత అనుకుంటారు. కొంతకాలం సంతోషంగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. దీనికిగాను పురుషులు వాడాల్సినవి పక్కన పెట్టేసి స్త్రీలకు గర్భ నిరోధక మాత్రలు వేసేసి సంసారం సాగిస్తారు. ఐతే ఇలా స్త్రీలు గర్భ నిరోధక మాత్రల

ఇప్పుడే పిల్లలు వద్దు అని చాలామంది జంటలు పెళ్లయిన తర్వాత అనుకుంటారు. కొంతకాలం సంతోషంగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. దీనికిగాను పురుషులు వాడాల్సినవి పక్కన పెట్టేసి స్త్రీలకు గర్భ నిరోధక మాత్రలు వేసేసి సంసారం సాగిస్తారు. ఐతే ఇలా స్త్రీలు గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం వల్ల దుష్ప్రభవాలు కలుగుతాయని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. హార్మోన్లతో కూడుకున్న గర్భ నిరోధక మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల వారిలో సహజసిద్దమైన రతిక్రియకు సంబంధించిన కోరికలు చల్లారిపోతాయని శాస్త్రజ్ఞులు తెలిపారు. 
 
గర్భ నిరోధక మాత్రలు తరచూ వాడటం మూలాన మహిళల్లో లైంగిక కోరికలు చచ్చిపోతాయని శాస్త్రజ్ఞులు వెల్లడించినట్లు జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. దాన్ని అనుసరించి రతిక్రియ ద్వారానే స్త్రీలు తమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తారని, దీంతో వారు ఎంతో చలాకీగా తమ పనులు పూర్తి చేసుకుంటుంటారని తెలిపారు. అదే వారు నిత్యం గర్భ నిరోధక మాత్రలు వాడుతుంటే వారిలో లైంగిక కోరికలు చచ్చిపోయి ఏదో కోల్పోతున్నామనే భావన వారిలో కలుగుతుంటుందని, దీంతో వారు తాను చేసే పనుల్లో ప్రత్యేక శ్రద్ధ కనబరిచే స్థితిలో ఉండరని తమ పరిశోధనల్లో తేలిందని తెలిపారు. 
 
గర్భ నిరోధక మాత్రలు వాడే మహిళలు తమలో కలిగే లైంగిక కోరికలను ఓ రకమైన వ్యాధిగా భావిస్తుంటారని అభివర్ణించారు. ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరి పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుందని, మిగిలిన ముగ్గురి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంటుందని తెలిపారు. గర్భ నిరోధక మాత్రలు వాడే స్త్రీలలో లైంగిక కోరికలు తగ్గిపోతున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని స్పష్టం చేసినట్లు ఆ పత్రిక వెల్లడించింది. గర్భ నిరోధక మాత్రలు-మహిళలు అనే అంశంపై దాదాపు 1086 మహిళలపై పరిశోధనలు జరిపినట్లు తెలిపారు.