ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 ఏప్రియల్ 2017 (17:11 IST)

డేంజరస్ రొమాంటిక్ ఫ్రేమ్... గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...

పురుషులు ఏం కోరుకుంటారు...? అదే రొమాన్స్ విషయంలో... తమకు నచ్చిన స్త్రీతో రొమాన్స్ చేయాలని చాలామంది పురుషులు కోరుకుంటారట. కోరుకోవడమే కాదు ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలా...? అని తెగ ఆలోచిస్తారట. ఇందుకోసం ఏదో వంకతో తొలి పరిచయం పెంచుకుంటారు. అలా మొదలైన పర

పురుషులు ఏం కోరుకుంటారు...? అదే రొమాన్స్ విషయంలో... తమకు నచ్చిన స్త్రీతో రొమాన్స్ చేయాలని చాలామంది పురుషులు కోరుకుంటారట. కోరుకోవడమే కాదు ఆమెను ఎలా ప్రసన్నం చేసుకోవాలా...? అని తెగ ఆలోచిస్తారట. ఇందుకోసం ఏదో వంకతో తొలి పరిచయం పెంచుకుంటారు. అలా మొదలైన పరిచయాన్ని క్రమంగా శృంగారం వైపుకు మరలించేందుకు చూస్తారు. అయితే ఆ ప్రతిపాదనను సదరు మహిళ నిర్మొహమాటంగా తిరస్కరిస్తే... ఏం జరుగుతుందీ...?
 
వద్దన్నా, కాదన్నా ఇక ఆ మగపురుషుడు సదరు మహిళ చుట్టూ ఓ దీపపు పురుగులా తిరుగుతూనే ఉంటాడు. కాళ్లావేళ్లా పడి ఎలాగైనా ఒప్పించేందుకు నానా తంటాలు పడతాడు. ఆమె తను ఉన్న ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్లేంతవరకూ వదలడు. ఒకవేళ అలా వెళ్లిపోయినా ఆమె వివరాలు సేకరించి మళ్లీ ఆమె జీవితంలో ప్రవేశించడానికి సిద్ధమవుతాడు. 
 
దీనికి వెనుక కొన్ని కారణాలున్నాయంటున్నారు సెక్సాలజిస్టులు. కొందరు మగాళ్లు తమకు నచ్చిన స్త్రీలతో ఎలాగైనా రొమాన్స్ చేయాలని కోరుకుంటారట. అందులో భాగంగానే తొలుత పరిచయం చేసుకుని, దానిని మరింత పెంచి, బాగా సన్నిహితమైన తర్వాత రొమాన్స్ విన్నపం ఆమె ముందుంచుతాడట. అతడి విన్నపాన్ని సదరు మహిళ ఒప్పుకుంటే, ఇక రొమాన్స్ రొటీన్. కాదంటేనే... ప్రశ్న. ఆమెను వదలక వెంటాడటానికి సిద్ధపడతాడు. 
 
కారణం...రొమాన్స్ చేయడం ఇష్టం లేదని ఖరాఖండిగా చెప్పడంలో కొందరు మహిళలు విఫలమవుతుండటమే. ఎందుకంటే, అప్పటివరకూ ఎంతో స్నేహంగా మసలిన సదరు బాయ్‌ఫ్రెండ్‌తో మందలింపు ధోరణిలో కాక చాలా సౌమ్యంగా "రొమాన్స్ ఇష్టం లేదు" అని చెపుతారట. ఈ మెతక వైఖరిని ఆసరా చేసుకున్న మగాడు ఎలాగైనా ఆమెను శృంగారంలోకి దింపాలని ప్రయత్నాలు చేస్తాడట. 
 
కనుక పరిచయం కాస్తా రొమాంటిక్ దిశగా సాగుతున్నదని అనుమానం వచ్చినప్పుడే అతడితో నిర్మొహమాటంగా, కుండ బద్ధలు కొట్టినట్లు "నో" అని చెప్పినప్పుడు ఈ పరిస్థితి దాపురించే అవకాశం లేదంటున్నారు నిపుణులు. అయితే రొమాన్స్‌కి వివాహం కానివారు, అయినవారు అనే భేదం లేదనీ, అది ఎప్పుడైనా.. ఎవరిలోనైనా కలుగవచ్చని అంటున్నారు. ఈ డేంజరస్ రొమాంటిక్ ఫ్రేమ్ నుంచి తప్పుకోవాలంటే, సదరు పురుషుని ప్రవర్తన ఎలా ఉన్నదో ఒక్కసారి చూసుకుని స్నేహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటున్నారు.