శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 26 మార్చి 2016 (09:42 IST)

పెడిక్యూర్ చేయండిలా...!

చాలామంది మహిళలు తమ ముఖ సౌందర్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత వారి కాళ్ళకు ఇవ్వరు. చేతులు, కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలాముఖ్యం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు కాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాళ్ళలో చేరుకున్న మురికి, కాలి వేళ్లల్లో చేరుకున్న మురికిని తొలగించుకునేందుకు స్నానం చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనికి పెడిక్యూర్ మాత్రమే ఓ మంచి ఉపాయం.  
 
కాళ్ళల్లో పగుళ్ళు ఏర్పడినప్పుడు వాటిని అందంగా తీర్చిదిద్దేందుకు పెడిక్యూర్ ఓ మంచి ఉపాయం. పెడిక్యూర్‌ను మీరు ఇంట్లోకూడా చేసుకోవచ్చంటున్నారు వైద్యులు. 
 
పెడిక్యూర్ చేసే విధానం: 
ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని వేసుకోండి. అందులో షాంపూ, హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు అమ్మోనియా కలుపుకుని 15-20నిమిషాలపాటు మీ కాళ్ళను అందులో ఉంచండి. దీంతో కాళ్ళ పగుళ్ళలో చేరుకున్న మురికి బయటకు వచ్చేస్తుంది. 
 
15-20 నిమిషాల తర్వాత కాళ్ళను శుభ్రమైన నీటితో కడిగి మెత్తటి తువాలుతో తుడవండి. ఇప్పుడు ఫైలర్‌తో గోళ్ళకు ఓ షేప్ ఇవ్వండి.
 
క్యూటికల్ కటర్‌తో గోళ్ళకు ఇరువైపులా ఉన్న చర్మాన్ని కట్‌చేసి శుభ్రపరచండి. గోళ్ళలోనున్న మురికినికూడా శుభ్రపరచండి. 
 
స్క్రబర్‌తో మీ పాదాలను స్క్రబింగ్ చేసి కాళ్ళకు విటమిన్ "ఈ"కు చెందిన క్రీముతో మసాజ్ చేయండి.
 
కాళ్ళను మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు మీ కాలి గోళ్ళకు నెయిల్ పెయింట్ వేయండి. దీంతో కాళ్ళు అందంగా కనపడుతాయి.