శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (15:50 IST)

చేమదుంపల్లో జిగురు పోవాలంటే? ఈ చిట్కాలు పాటిస్తే...

చేమదుంపల్లోని జిగురు తొలగిపోలాంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది. చేమదుంపల్ని ఉడికించి ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తరువాత వాటి తోలును తీస్తే జిగురు పోతుంది. అలాగే పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని వేడి నీటితో పాటు పాలను చేర్చుకుంటే పూరీలు మ

చేమదుంపల్లోని జిగురు తొలగిపోలాంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే మంచిది. చేమదుంపల్ని ఉడికించి ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తరువాత వాటి తోలును తీస్తే జిగురు పోతుంది. అలాగే పూరీలకు పిండి సిద్ధం చేసేటప్పుడు గోరువెచ్చని వేడి నీటితో పాటు పాలను చేర్చుకుంటే పూరీలు మృదువుగా ఉంటాయి.
 
కోడిగుడ్డును ఉడికించేటప్పుడు నీటితో పాటు రెండు డ్రాప్‌ల వెనిగర్ చేర్చితే, కోడిగుడ్లు పగులవు. వంట చేసేందుకు అరగంటకు ముందే బియ్యాన్ని, పప్పుల్ని నానబెట్టి ఉడికిస్తే అవి త్వరగా ఉడుకుతాయి. ఆవకాయ లేదంటే ఏదైనా ఊరగాయ తయారుచేసేటప్పుడు ఉప్పును కాస్త వేయించి చేర్చుకుంటే ఊరగాయలు చాలా రోజులకు నిల్వగా ఉంటాయి.