ఎలాంటి వారు విడాకులు కోరవచ్చు...
సంసార జీవితం అన్నాక చిన్నచిన్న అలకలు, చికాకులు సహజం. వివాహ బంధం పవిత్రమైనదే కాదు.. బలమైనది కూడా. కోట్లు, లక్షల రూపాయలు ఖర్చు చేసిన పెళ్లి ఆర్భాటపు సందడి సమసిపోకముందే కోర్టు మెట్లెక్కే స్థాయికి అనేక మంది జంటలు దిగజారుతున్నారు. ఈ తరంలో ఓర్పు, సహనం కరువవ్వడమే ఇందుకుకారణం.
తమకాళ్లపై తాము నిలబడగలమన్న ధైర్యంతో వివాహబంధానికి విలువివ్వడం లేదు అనేక మంది యువతీ యువకులు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తుండటం పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెళ్లిళ్లు మూణ్ణాళ్ళ ముచ్చటగా మారిపోయాయి. నిజానికి విడాకులు ఎలాంటి కారణాలతో అడగొచ్చన్న అంశంపై న్యాయ నిపుణులను సంప్రదిస్తే,
* దంపతుల్లో ఎవరికైనా వివాహేతర సంబంధం ఉంటే మిగిలిన వారు
* ఎయిడ్స్ వంటి భయానక వ్యాధులు బాధితులైనా...
* గృహహింస అధికంగా ఉన్నా...
* ఇద్దరిలో ఎవరైనా కాపురానికి పనికిరాకున్నా
* మొదటి వివాహాన్ని దాచి మోసంతో రెండో వివాహం చేసుకున్నా
* ఇష్టం లేకుండా పెళ్లి చేసినా...
* పద్దెనిమిదేళ్లలోపు వివాహం చేసినా...
* మానసిక స్థితి సరిగా లేకున్నా...
ఇలాంటివారు పెళ్లయిన యేడాది తర్వాత విడాకులు తీసుకునేందుకు హక్కు వస్తుంది. అయితే, చట్టపరంగా వేరుపడేందుకు కనీసం ఆరు నెలల సమయం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇరువర్గాల వారికి కోర్టు ఆధ్వర్యంలో న్యాయనిపుణులు కౌన్సెలింగ్ ఇస్తారు. అప్పటికీ కలిసివుండలేమన్న భావనకు భార్యభర్తలు వస్తే వారికి కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.