సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (17:02 IST)

ఆమె వైకల్యాన్ని జయించింది, నారీ శక్తిగా అవతరించింది

నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంటూ
ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ స్ఫూర్తిదాయక స్పీకర్, వైకల్యం కార్యకర్త, ప్రపంచ ఆర్థిక ఫోరం గ్లోబల్ షేపర్, మాల్వికా అయ్యర్ సాధించిన ఘనతను ప్రపంచం కొనియాడుతోంది. గత మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆమె తన ప్రసంగంలో కొంత భాగాన్ని ట్విట్టర్‌లో పంచుకుంది. తన జీవితంలో క్లిష్ట పరిస్థితుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.
రాజస్థాన్‌లోని బికానెర్‌ నివాసి అయిన 30 ఏళ్ల మాల్వికా ఇలా రాసారు. "నాకు 13 ఏళ్ళ వయసులో, గ్రెనేడ్ పేలుడులో నేను నా రెండు చేతుల ముందు భాగాన్ని కోల్పోయాను. ఆ తర్వాత కూడా చేతిలో ముంజేతి భాగం ఎక్కడైనా తాకినట్లయితే, నాకు చాలా నొప్పి అనిపిస్తుంది. అయినప్పటికీ, ఈ వైకల్యం కారణంగా నేను ఓడిపోకూడదు. జీవితంలో జయించాల్సిందే. అందుకే నా ముంజేతిఈ ఎముకను వేలులా ఉపయోగించాను. నేను నా చేతితో పిహెచ్‌డి థీసిస్‌ను టైప్ చేసాను." అని తన మొక్కవోని పట్టుదల వైనాన్ని వెల్లడించారు.
హ్యూమన్స్ ఆఫ్ బొంబాయిలో తన ప్రయాణాన్ని గడిపిన మాల్వికా, "నేను వైకల్యం యొక్క షాక్‌ను జయించాను. చిన్న విషయాలలో ఆనందాన్ని కనుగొనడమే నాకున్న గొప్ప బలం" అని రాసారు, 'ప్రతి మేఘం వెన్నెలని దాచిపెడుతుంది, నేను దాని నుండి ప్రేరణ పొందాను. ఇప్పుడు నేను చాలా అసాధారణమైన వేలితో సృష్టించిన నా వెబ్‌సైట్ చూసినప్పుడు చాలా సంతోషిస్తున్నాను.
 
మల్వికా అయ్యర్ తన ట్వీట్‌లో వేలాది లైక్‌లు, వ్యాఖ్యలను అందుకున్నారు. ఒక యూజర్ 'మీరు నమ్మశక్యం కాని వ్యక్తిత్వం' అని రాశారు. ఇలా ఎన్నో ట్వీట్లు, కామెంట్లు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ రాశారు. ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోబోయే కొన్నిరోజులు ముందుగా ఇలాంటి స్ఫూర్తిదాయక మహిళ జీవితం ఎందరికో ఆదర్శం. ఆమె తన రెండు చేతులను కోల్పోయిన తరువాత కూడా జీవితంపై ఆశలను వదులుకోలేదు. సమస్యల నుంచి సవాళ్లను ఎదుర్కొని శిఖరాగ్ర ప్రయాణం చేస్తున్నారు.