సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 4 జులై 2021 (01:22 IST)

04-07-2021- ఆదివారం మీ రాశి ఫలితాలు.. సూర్యుడిని ఆరాధిస్తే...?

సూర్యుని ఆరాధించినట్లైతే మీకు అన్ని విధాలా శుభం కలుగుతుంది. 
 
మేషం: ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. మీ లక్ష్య సాధనకు నిరంతర కృషి అవసరం. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ప్రియతములతో షాపింగ్‌లు చేస్తారు. సమయానికి కావలసిన వస్తువులు కనిపించకుండా విసుగు చెందుతారు. ఖర్చులకు సంబంధించి వ్యూహాలు అమలు చేస్తారు.
 
వృషభం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికంగా వున్నా రాబడి విషయంలో పురోభివృద్ధి కానవస్తుంది. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరు వ్యాపారస్తులకు లాభదాయకం. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మిథునం: ఏదైనా అమ్మటానికై చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. ప్రతి విషయంలోను స్వయం శక్తినే నమ్ముకోవటం మంచిదని గమనించండి. మీ కుటుంబ సమస్యలకు చక్కని పరిష్కార మార్గం గోచరిస్తుంది. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. 
 
కర్కాటకం: ఉద్యోగస్తులకు విశ్రాంతి లభించడంతో వారి ఆలోచనలు పలువిధాలుగా వుంటాయి. ముందు వెనుకలుగా నైనా మీరు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తి కాగలవు. స్థిరాస్తి అమ్మకం లేదా కొనుగోలు వాయిదా వేయడం మంచిది. హోటల్, తినుబండారు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
సింహం: స్త్రీలు పట్టుదల, మొండితనంగా వ్యవహరించి అయిన వారికి దూరమవుతారు. నూతన పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కళారంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. పెంపుడు జంతువులపై శ్రద్ధ వహిస్తారు. 
 
కన్య: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిదని గమనించండి. బంధువుల రాకతో గృహంలో కొత్త వాతావరణం నెలకొంటుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.
 
తుల: కొబ్బరి, పండ్ల, పానీయ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సాయం అర్థించవద్దు. జాగ్రత్త వహించండి. విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతులవుతారు. స్త్రీలు పరోపకరానికి పోవడం వల్ల మాటపడవలసి వస్తుంది. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
వృశ్చికం: ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా వుంటుంది. స్త్రీలకు ఇరుగుపొరుగు వారితో సఖ్యత అంతగా వుండదు. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది.
 
ధనస్సు: ఎవరికైనా ధనసాయం చేసినా తిరిగిరాజాలదు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రాజకీయాల వారికి పార్టీ పరంగాను, అన్నివిధాలా గుర్తింపు లభిస్తుంది. ఏ పని మొదలెట్టినా మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయండి. చేతివృత్తులు క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి లభిస్తుంది.
 
మకరం: ఒక స్థిరాస్తి విక్రయించాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. కుటుంబం కోసం అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల యందు ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి.
 
కుంభం: సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఒకరికి సాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. దైవదర్శనాల్లో చురుకుగా పాల్గొంటారు. క్లిష్ట సమయంలో బంధుమిత్రులు జారుకుంటారు. అర్ధాంతరంగా నిలిపివేసిన గృహ మరమ్మతులు, పనులు పునః ప్రారంభిస్తారు. ఇంటర్వ్యూల్లో అనుకూల ఫలితాలుంటాయి.
 
మీనం: ఏ విషయమైనా పూర్తిగా తెలుసుకోకుండా నిర్ధారణకు రావడం మంచిది కాదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించుకోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. స్త్రీలతో కలహాలు, అన్ని కార్యాలయందు విఘ్నాలు ఎదుర్కొంటారు. దైవ దర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.