మంగళవారం, 14 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

29-06-2021 మంగళవారం దినఫలాలు - గణపతిని తెల్లని పూలతో ఆరాధించినా...

మేషం : మీ అతిథి మర్యాదలు బంధు మిత్రులు ఆకట్టుకుంటారు. పాత మిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. అసలైన శక్తిసామర్థ్యాలు మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల వాక్‌చాతుర్యంనకు మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృషభం : ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. 
 
మిథునం : ఎగుమతి, దిగుమతి వ్యాపారస్తులకు, ఉమ్మడి వ్యాపారస్తుల శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు అనివార్యం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్, మెకానికల్ రంగాల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఉపాధ్యాయులకు నూతన వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. కోర్టు వ్యవహారాలు మెళకువ అవసరం. 
 
సింహం : గణితం, సైన్స్ రంగాలలో వారికి లాభదాయకంగా ఉండగలదు. కీలకమైన వ్యవహారాలు మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది. శ్రమాధిక్యత, అకాల భోజనం, వంటి చికాకులు తప్పువు. కుటుంబంలో చికాకులు తొలగి ప్రశాంతత నెలకొంటుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. 
 
కన్య : పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విజ్ఞతగా వ్యవహరించి ఒక సమస్యను పరిష్కరిస్తారు. జూదాల్లో ధననష్టం, చికాకులు ఎదుర్కొంటారు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. 
 
తుల : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకువేస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారమవుతాయి. బంధువుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. నిర్మాణ పనులు, మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. 
 
వృశ్చికం : విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ వహించండి. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. పత్రికా, ప్రైవేట్ రంగాలలోని వారికి మార్పులు అనుకూలం. పారిశ్రామిక రంగంలో వారికి తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
ధనస్సు : ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో మెళకువ అవసరం. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుటారు. 
 
మకరం : సన్నిహితుల వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. మీపై సన్నిహితుల మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకులు తప్పవు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అనుకున్నది సాధిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రావలసిన ధనం అందుకుంటారు. 
 
కుంభం : ఆర్థిక వ్యవహారాలలో భాగస్వామిక వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. చెల్లింపులు, షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. ఇతరులను విమర్శించడం వల్ల మాటపడక తప్పదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను చేపడుతారు. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. 
 
మీనం : తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులకు గురికాక తప్పదు. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం తగ్గుతుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు.