శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-06-2022 శనివారం రాశిఫలాలు ... శ్రీరామును పూజించిన శుభం, జయం...

astro12
మేషం :- పండ్ల, పూలు, ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రైవేటు విద్యా సంస్థల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. స్థిరచరాస్తుల విక్రయంలో పునరాలోచన అవసరం. దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
వృషభం :- మీ ఉన్నతిని చాటుకోవటానికి ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి చికాకులు ఎదురవుతాయి. ఇతరుల సహాయం అర్థించటం వల్ల మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెలకువ అవసరం. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
మిథునం :- కళ, క్రీడా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువులతో విభేదాలు తొలగి రాకపోకలు అధికమవుతాయి. గృహ నిర్మాణాల్లో జాప్యం వల్ల నిరుత్సాహం తప్పదు. ముక్కుసూటిగాపోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- స్త్రీలలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగస్తులకు అధికారిక పర్యటనలు, బాధ్యతలు అధికమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకువస్తాయి.
 
సింహం :- ఇతరులకు మేలు చేసేందుకు యత్నించండి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే సంఘటనలెదురవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు అధికారుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. అకాల భోజనం, శారీరక శ్రమవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికం. దైవ దర్శనాలు, మొక్కుబడులు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు ఒత్తిడి అధికం.
 
తుల :- వృత్తుల వారికి పురోభివృది, గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు తలెత్తినా క్రమంగా సమసిపోగలవు. రావలసిన ధనం అందటంతో పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దూర ప్రయాణాల గురించి ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకెంతో శుభం చేకూరుతుందని గమనించండి. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్పులు, అనుకోని చెల్లింపులు వల్ల ఆటుపోట్లు తప్పవు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు మార్చుకుంటారు.
 
ధనస్సు :- ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత అంతగా ఉండదు. పాత మిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో మెలకువ వహించండి. విద్యార్థులకు వాహనం నడుపు తున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. గృహంలో విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
 
మకరం :- ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, చికాకులు అధికం. బంధువుల కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో మెలకువ అవసరం. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులైఉంటారు.
 
కుంభం :- దైవ, సేవ, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. స్త్రీలపై చెప్పుడు మాటల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సున్నితంగా వ్యవహరించండి.
 
మీనం :- ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దూర ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులై ఉంటారు. నూతన దంపతుల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. వృత్తుల వారికి గుర్తింపు, శ్రమకు తగిన ఆదాయం లభిస్తాయి. పెద్ద మొత్తం రుణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.