శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-06-2022 గురువారం రాశిఫలాలు ... సాయిబాబాను ఆరాధించిన సంకల్పసిద్ధి...

astro10
మేషం :- నోటీసులు, రశీదులు అందుకుంటారు. విద్యార్జనులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సుతో మంచి అవకాశం లభిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. క్రయ విక్రయాల్లో మెలకువ వహించండి.
 
వృషభం :- స్త్రీలకు ఆరోగ్యం అంత సంతృప్తికరంగా ఉండదు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. మొక్కుబడులు, దైవకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లుగానే వాయిదా పడతతాయి.
 
మిథునం :- ఒకే కాలంలో అనేక పనులు చేపట్టటం వల్ల కాంట్రాక్టర్లు సమస్యలకు లోనవుతారు. కుటుంబ, ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.
 
కర్కాటకం :- మీ ప్రమేయం లేకున్నా మాటపడవలసి వస్తుంది. నిరుద్యోగులు ఏ చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవటం మంచిది. వృత్తిపరమైన బాధ్యతలు, ప్రజా సంబంధాలు విస్తరిస్తాయి. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో సఫలీకృతులవుతారు.
 
సింహం :- మీ అవసరాలకు కావలసిన ధనం సమయానికి ఏదో విధంగా సర్దుబాటు కాగలదు. మీ యత్నాలకు ఆటంకాలు తొలగిపోయి పనులు సానుకూలమవుతాయి. మీ బంధువుల పరపతి మీకే విధంగానూ ఉపయోగపడదు. ప్రముఖులను కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి.
 
కన్య :- రావలసిన ధనం వసూలులో కొంత మొత్తం వసూలు కాగలదు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత, సునిశిత పరిశీలన ముఖ్యం. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ యత్నాలకు సన్నిహితులనుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
తుల :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కని పెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు విలాసవస్తువులు, అలంకారాల పట్ల వ్యా మోహం అధికం. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు లాభదాయకంగా ఉంటుంది.
 
వృశ్చికం :- మీ కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందగలరు. ప్రేమికులు అతిగా వ్యవహరించి ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు.
 
ధనస్సు :- చేతి వృత్తులు, చిరు వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. స్త్రీలు ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. అపరిచిత వ్యక్తులు మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
మకరం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు మెలకువ అవసరం. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. మీ చిన్నారుల భవిష్యత్ గురించి తగుశ్రద్ధ తీసుకుంటారు. ఖర్చులు రాబడికి తగినట్లుగా ఉంటాయి. స్త్రీల మాటకు ఆదరణ, సంఘంలో గౌరవం లభిస్తాయి.
 
కుంభం :- రుణాలు తీర్చి తాకట్టులు విడిపించుకుంటారు. మిత్రులవల్ల మీ కార్యక్రమాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. కవి, పండితులకు, కళాకారులకు సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి.
 
మీనం :- కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ముఖ్యమని గమనించండి. ప్రతి వ్యవహారంలోను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. చేతివృత్తుల వారికి ఆశాజనకం, విద్యార్థులు శుభవార్తలు వింటారు. మితిమీరిన ఆలోచనలు మీ మనస్సును వ్యాకుల పరుస్తాయి.