ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-01-2023 శనివారం దినఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం

Pisces
మేషం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు. వైద్యులకు ఒత్తిడి, ఆడిటర్లకు సంతృప్తి, ప్లీడర్లకు చికాకు తప్పవు. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి.
 
వృషభం :- కాంట్రాక్టర్లు చేపట్టిన పనులు ఏమంత సంతృప్తినివ్వజాలవు. వారసత్వపు వ్యవహారాలలో చికాకులు తప్పవు. దూర ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పసుపు, మిర్చి, నూనె, కంది, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది.
 
మిథునం :- చేపట్టిన కార్యక్రమాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైన సంతృప్తిగా పూర్తికాగలవు. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు చిన్న అవకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. వాతావరణంలో మార్పు వ్యవసాయదారులకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం :- ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది.
 
సింహం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించినంత ఫలితం ఉండదు. అంతగా పరిచయం లేని వారికి ధనసహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి.
 
కన్య :- ఉపాధ్యాయులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. మార్కెటింగ్, ప్రైవేటు సంస్థల్లో వారికి ఒత్తిడి అధిక శ్రమకు గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేనేత, ఖాదీ వస్త్ర పరిశ్రమల వారికి శ్రమకు తగిన గుర్తింపు కానవస్తుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారు ఒత్తిడి ఎదుర్కొంటారు.
 
తుల :- వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలవు. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు కొంతవరకు సఫలమవుతాయి.
 
వృశ్చికం :- టెక్నికల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ రంగాలలో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. ఉపాధ్యాయులకు నూతన ఆలోచనలు స్పురిస్తాయి. తలపెట్టిన పనుల్లో ఒకింత జాప్యం, చికాకు తప్పదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. విద్యార్ధినుల తొందరపాటుతనం వల్ల చికాకులు తప్పవు.
 
ధనస్సు :- ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ వహించండి. క్రయవిక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలు, దూరప్రయాణాల్లో మెళకువ వహించండి. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుటపడతారు. మిత్రులను కలుసుకుంటారు.
 
మకరం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. కాంట్రాక్టర్లు నిర్మాణపనుల్లో పనివారలతో లౌక్యంగా మెలగవలసి ఉంటుంది. కొబ్బరి, పండు, పూల వ్యాపారులకు లాభం. రుణాలు, బకాయిల వసూళ్ళ విషయంలో జాప్యం తప్పదు. విద్యార్ధుల ఆలోచనల పక్కదారి పట్టకుండా తగు జాగ్రత్తలో ఉండటం క్షేమదాయకం.
 
కుంభం :- వస్త్ర, బంగారు, వెండి రంగాలలో వారికి పనివారితో సమస్యలు తలెత్తగలవు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరుల కుటుంబ విషయాల్లో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి. ప్రతి అవకాశం చేతిదాకా వచ్చి జారిపోవటంతో నిరుత్సాహానికి లోనవుతారు.
 
మీనం :- అధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. ఆలయానలు సందర్శిస్తారు. సన్నిహితుల మధ్య రహస్యాలుదాచడం వల్ల విభేదాలు తలెత్తవచ్చు. చేపట్టిన వ్యాపారాలలో నిలదొక్కుకోవటానికి చేసే యత్నాలలో సఫలీకృతులవుతారు.