1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-09-2022 సోమవారం దినఫలాలు - రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించి...

astro8
మేషం :- శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. మీ అభిరుచికి తగిన వక్తులతో పరిచయాలేర్పడతాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమిస్తారు.
 
వృషభం :- ఆర్థిక లావాదేవీలు, కీలకమైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు. కొబ్బరి, పండ్ల, పూల, బేకరి, తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తాయి. రుణాలు చేబదుళ్ళకు యత్నాలు సాగిస్తారు.
 
మిథునం :- మొండిధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలు షాపింగ్ విషయాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు. ప్రముఖుల కలయిక అనుకూలించదు. అతిథి మర్యాదలు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు.
 
కర్కాటకం :- గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వాయిదా పడతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది.
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ది పొందుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
కన్య :- పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు, ఇళ్ళస్థలాల బ్రోకర్లకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు, వృత్తుల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికి వాటిని సద్వినియోగం చేసుకోలేరు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
 
తుల :- ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపులకు కలసిరాగలదు. ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ అభిప్రాయాలు బయటకు వ్యక్తం చేయటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ధనం మితంగా వ్యయం చేయటం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతతో పనిచేయవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీలకు ఆర్జనపట్లల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదా వేయటం మంచిది. రుణాలు తీరుస్తారు.
 
ధనస్సు :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థుల్లో మందకొడితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
మకరం :- రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఖర్చులు అధికం. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. మిత్రుల ప్రోత్సాహంతో నిరుద్యోగులు ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించినంతగా ఉండదు. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మీనం :- సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి. మీ వాగ్ధాటితో ప్రముఖులను, అధికారులను ఆకట్టుకుంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కంప్యూటర్ రంగాల వారు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. గ్రహాల అనుకూలత వల్ల కార్యసిద్ధి, వ్యవహార జయం పొందుతారు.