బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-11-2021 గురువారం మీ రాశిఫలాలు : రాఘవేంద్రస్వామిని పూజించినా...

మేషం :- ఆలయాలను సందర్శిస్తారు. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు. ఉన్నత విద్యా, విదేశీ వ్యవహారాలకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. వితండవాదాలు, హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది.
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. చిన్నతరహా, చిరు వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో మెళుకువ అవసరం. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శ్రమాధిక్యత తప్పడు. పరిశోధకులకు గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. 
 
మిథునం :- పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించిన సద్వినియోగం చేసుకోవడం మంచిది. సాహస ప్రయత్నాలకు సరియైన సమయం కాదని గమనించండి. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతిని పెంచుతాయి. తలపెట్టిన పనులు సమయానికి పూర్తికావు.
 
కర్కాటకం :- వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి, అధికారులతో సంభాషించేటపుడు అత్మనిగ్రహం వహించండి. కుటుంబ అవసరాలు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ది పొందటానికి యత్నిస్తారు.
 
సింహం :- ప్రైవేటు సంస్థల్లో వారు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. ఉత్తర ప్రత్యుత్తరాలలో సంతృప్తిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయాలన్న మీ యత్నం నెరవేరదు. రిప్రజెంటేవ్‌లకు, మార్కెటింగ్ రంగాల్లో వారికి ప్రయాణాల్లో ఒత్తిడి పెరుగుతుంది.
 
కన్య :- ఉద్యోగస్తులకు అధికారులతో అవగాహన కుదరదు. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. దైవ, పుణ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ ఆలోచనలు, పథకాలు గోప్యంగా ఉంచండి. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
తుల :- కాంట్రాక్టర్లకు చేపట్టిన పనిలో ఆటంకాలు తప్పవు. స్పెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. సోదరి, సోదరుల మధ్య అవగాహన కుదరదు. నూతన పరిచయస్తులు మీ నుండి ధనం లేక హామీలు అర్ధిస్తారు జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. పత్రిక, మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏ పని చేద్దామనుకున్నా పరిస్థితులు అనుకూలించవు.
 
ధనస్సు :- నిత్యవసర వస్తు స్టాకిస్టులు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చిరాకు తప్పవు. రావలసిన ధనం అతికష్టంమ్మీద వసూలువుతుంది. స్త్రీలకు పని భారం అధికం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందు లెదుర్కుంటారు.
 
మకరం :- స్థిరాస్తి కొనుగోలు, లేదా అమ్మకానికై చేయుప్రయాత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థునులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పుడు. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
కుంభం :- కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు మీగౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. గృహనిర్మాణాల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి, చికాకులు పెరుగుతుంది.
 
మీనం :- విద్యాసంస్థల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. అనుభవజ్ఞుని సలహా తీసుకోవడం వల్ల అభివృద్ధి పొందుతారు. ఖర్చులు ఆందోళనలు కలిగిస్తాయి. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.