బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (22:47 IST)

03.12.2023 నుంచి 09.12.2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ఆర్థికస్థితి ఆశాజనకం. రుణసమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వేడుకను ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సంబంధాలు బలపడతాయి. గురువారం నాడు బాధ్యతలు అప్పగించవద్దు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి లేక శ్రీవారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యవసాయకూలీలకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. చిరు వ్యాపారాలకు ఆదాయాభివృద్ధి.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే అసహనం చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఆత్మీయుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కీలకపత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ వారం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటిండి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. పెట్టుబడులకు తరుణం కాదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సంతానం ధోరణి ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు కష్టసమయం. ఉద్యోగస్తులకు పనిభారం. నోటీసులు అందుకుంటారు. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
కార్యానుకూలత, ధనలాభం ఉన్నాయి. వాగ్ధాటితో అందరినీ మెప్పిస్తారు. ఖర్చులు అధికం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో జరుగుతాయి. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆదివారం నాడు కీలక పత్రాలు, వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు చేపడతారు. ఆధ్మాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగినా మంచికేనని భావించండి. బాధ్యతల నుంచి విముక్తులవుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. పెద్దల సలహా తీసుకోండి. అవివాహితులకు శుభదాయకం. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
మీదైన రంగంలో నిలదొక్కుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంతమొత్తం పొదుపు చేయగల్గుతారు. సోమవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కీలక పత్రాలు అందుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మార్కెటింగ్ రంగాల వారు లక్ష్యాలను అధిగమిస్తారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కార్మికులు, వ్యవసాయ కూలీలకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆహ్వానం అందుకుంటారు. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ఆది, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవాభిమానాలకు భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు బాధ్యతల మార్పు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. మంగళవారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. నిరుద్యోగులకు శుభయోగం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు పనిభారం. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వాహనదారులకు దూకుడు తగదు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అంకితభావంతో శ్రమిస్తే విజయం తథ్యం. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యల్లో అలక్ష్యం తగదు. ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. సొంతంగా ఏదైనా చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ప్రతికూలతలు అధికం. సమర్థతకు గుర్తింపు ఉండదు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవటానికి యత్నించండి. సన్నిహితుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆదాయవ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. రిప్రజెంటేటివ్‌‍లకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఓర్పుతో ఉద్యోగ యత్నాలు సాగించండి. ఆరోగ్యం జాగ్రత్త. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ సాయంతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పొదుపు చేయాలన్న మీ ఆలోచన ఫలిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి ఆంతర్యం గ్రహించండి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. శనివారం నాడు పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. రాజీమార్గంలో సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలకు ధనం అందుతుంది. సోమవారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. నిరుద్యోగులకు శుభయోగం. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉద్యోగస్తులకు పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.