శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 30 నవంబరు 2018 (15:49 IST)

స్త్రీలు ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇలా చేయాల్సిందే..?

అనారోగ్యాల నుండి ఉపశమనం లభించాలంటే.. రోజుకో ఉసిరి కాయ తీసుకుంటే చాలు. శీతాకాలంలో ఉసిరి కాయలు చాలా విరివిగా దొరుకుతాయి. దీనిలోని ప్రయోజనాలు అంతా ఇంతా కాదు.. జ్వరాలు, కడుపునొప్పి వంటి ఇతర సమస్యల నుండి విముక్తి కలిగిస్తుంది. ఇంకా చెప్పాలంటే..
 
1. ఉసిరికి తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు మినహా ఐదు రుచులుంటాయి. ఉసిరిని తరుచుగా తీసుకుంటే శరీర వేడి తగ్గుముఖం పడుతుంది. స్త్రీలకు రక్త స్రావాన్ని అరికడుతుంది. ముత్రపిండాళ్లోని రాళ్లను కరిగిస్తుంది. 
 
2. ఈ కాలంలో వచ్చే జ్వరాల నుండి విముక్తి లభించాలంటే.. ఉసిరితో చేసిన వంటకాలు తీసుకోవాలి లేదా ఉసిరికాయలను రసంలా చేసుకుని అందులో నెయ్యి, ఉప్పు కలిపి సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
3. వాంతులుగా ఉన్నప్పుడు జావ కాచి అందులో 3 స్పూన్ల ఉసిరి రసం కలిపి తీసుకోవాలి. ఈ మిశ్రమం కీళ్లనొప్పులు, జుట్టు తెల్లబడడం, కంటి వ్యాధుల నుండి విముక్తి కలిగిస్తాయి. 
 
4. ఎక్కిళ్లను తగ్గించాలంటే.. ఉసిరిక రసంలో ఓ వెలగకాయ, పిప్పళ్ల చూర్ణం, తేనె కలిపి తాగాలి. ఇలా చేస్తే ఎక్కిళ్లు త్వరగా తగ్గుతాయి. ఉసిరికాయ ఆకలి నియంత్రణకు చాలా ఉపయోగపడుతుంది. 
 
5. ఉసిరికాయ చూర్ణంలో కొద్దిగా తేనె, పాలు కలిపి తీసుకోవాలి. ఇలా రాత్రి, ఉదయం రెండు మార్లు చేస్తే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. కడుపునొప్పిగా ఉన్నప్పుడు ఒక ఉసిరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిల్లో కొద్దిగా ఉప్పు, కారం కలిపి సేవిస్తే నొప్పి తగ్గుతుంది. 
 
6. వాత, పిత్తా రోగాలను తగ్గిస్తుంది. ఉసిరి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్స్ రకరకాల వ్యాధులకు దూరంగా ఉండేలా చేస్తాయి. అలానే వాత, పిత్త రోగాలను కూడా తగ్గిస్తుంది.