శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సందీప్ కుమార్
Last Updated : బుధవారం, 28 ఆగస్టు 2019 (15:21 IST)

అరటిపువ్వు.. ఆ సమస్యను దూరం చేసుకోవచ్చునట..? (video)

పర్యావరణంలో వచ్చే మార్పులు, మనం తినే ఆహారం కారణంగా ప్రస్తుత కాలంలో అనేక రోగాలు మన దరి చేరుతున్నాయి. వాటిని తగ్గించుకోవడానికి రకరకాల మందులు వాడుతున్నాం. వాటి వలన ఉపశమనం కలిగినప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా చూపుతాయి. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వాటితో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అరటి పువ్వు కూడా ఎన్నో అనారోగ్యాల నుండి మనల్ని రక్షిస్తుంది. 
 
అరటిపువ్వుని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపి సక్రమంగా పనిచేసేటట్లు దోహదపడుతాయి.
 
వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వీర్యవృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది. అరటిపువ్వు ఆడవారిలో బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం అరికట్టడానికి పనికొస్తుంది.