శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:32 IST)

బరువు తగ్గాలంటే.. తులసీ ఆకుల టీని సేవించాలట..

తులసి ఆకులు, పువ్వులు, గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తులసి మొక్కకు పూసే పువ్వులు బ్రాంకైటిస్ సమస్యను దూరం చేస్తాయి. మలేరియా వున్నవారు ఈ మొక్క ఆకులు, గింజల్ని మిరియాలతో కలిపి పావు స్పూన్ మేర తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. తులసీని ఇంట్లో పెంచుకుంటే... ఆరోగ్యంతో పాటు ఎలాంటి దోషాలు అంటవని చెప్తుంటారు. 
 
తులసి ఆకుల్ని రోజూ రెండేసి నమలడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్ వున్నవారికి తులసి చక్కని విరుగుడులా పనిచేస్తుంది. రకరకాల క్యాన్సర్ల నుంచి నియంత్రిస్తుంది. బీపీని అదుపులో వుంచుతుంది. కాలేయానికి తులసి మంచి టానిక్‌గా ఉపయోగపడుతుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ.. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. 
 
ఇంకా శ్వాసకోశ సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. దంతాలకు రక్షణ నిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బరువును తగ్గించడంలో తులసీ బాగా పనిచేస్తుంది. రోజు పరగడుపున తులసీ ఆకులను నమిలి తినడం ద్వారా బరువు సులభంగా తగ్గుతారు. తులసీ ఆకుల టీని రోజుకు రెండుసార్లు సేవించడం ద్వారా ఒబిసిటీ దరిచేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.