మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2016 (11:45 IST)

మహిళలూ 30 పదులు దాటేశారా? సోయపాలుతో ఆరోగ్యం + అందం పొందండి

వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకలకు సంబంధించిన వ్యాధులు తొంగిచూస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళల్లో కనిపించే ప్రధాన సమస్య ఆస్టియోపోరోసిస్‌. ఆ సమస్య తీవ్రతను కొంతవరకూ తగ్గించుకోవాలంటే.. సోయాపాలు

వయస్సు పెరిగే కొద్దీ మహిళల్లో ఎముకలకు సంబంధించిన వ్యాధులు తొంగిచూస్తాయి. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన మహిళల్లో కనిపించే ప్రధాన సమస్య  ఆస్టియోపోరోసిస్‌. ఆ సమస్య తీవ్రతను కొంతవరకూ తగ్గించుకోవాలంటే.. సోయాపాలు రోజూ రెండు గ్లాసులు తీసుకోవాల్సిందే. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌ ఎముకలకు తగిన క్యాల్షియం క్యాల్షియం అందేలా తోడ్పడుతుంది. తద్వారా వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు. 
 
మెనోపాజ్‌ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోను తగ్గిపోతుంటుంది. హృద్రోగం, మధుమేహం, అధికబరువు వంటి సమస్యలు వీళ్లని వేధిస్తుంటాయి. సోయాపాలు ఇలాంటివాటికి చక్కటి ఉపశమనం. సోయాలోని ఫైటోఈస్ట్రోజెన్‌.. ఆ హార్మోను లోపాన్ని సవరిస్తుంది. ఈ పాలలోని ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులూ, పీచు, విటమిన్లూ, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినందివ్వడమే గాకుండా చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి. 
 
ఈ పాలను తరచూ తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ పెట్టవచ్చు. ఇందులోని ఒమెగా 3, 6 ఫ్యాటీయాసిడ్లు, అత్యంత శక్తిమంతమైన ఫైటో - యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్రీరాడికల్స్‌ వల్ల కలిగే హానిని నియంత్రిస్తాయి. దీనివల్ల ఆరోగ్యమే కాదు.. అందం కూడా మీ సొంతమవుతుంది.
 
సోయాపాలలో చక్కెర తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా కెలోరీల సంఖ్య కూడా తక్కువే. కెలోరీల పరంగా ఇది వెన్నతీసిన పాలతో సమానం. కాబట్టి బరువు తగ్గడం సులువు అవుతుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరానికి పీచూ అందుతుంది కాబట్టి.. తరచూ ఆకలి కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.