ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2022 (22:23 IST)

టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్‌కు సోషల్ మీడియాలో వేధింపులు-కేసు నమోదు

Naina Jaiswal
హైదరాబాద్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిక నైనా జైస్వాల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.

 
సదరు వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెపై వేధింపులకు పాల్పడుతున్నాడని నైనా తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మానసిక సమస్యలున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు.