ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (12:16 IST)

చిక్కటి కొబ్బరి పాలలో కొన్ని తేనె చుక్కలు, బాదం నూనె కలిపి...

ఇంట్లోనే తయారుచేసుకోగల మరొక కండిషనర్ గా కొబ్బరి పాలను తెలపవచ్చును. కొబ్బరిపాలు జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన తేమను అందిస్తాయి. ఒక కప్పు కొబ్బరిపాలను తీసుకు

ఇంట్లోనే తయారుచేసుకోగల మరొక కండిషనర్‌గా కొబ్బరి పాలను తెలపవచ్చును. కొబ్బరిపాలు జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన తేమను అందిస్తాయి. ఒక కప్పు కొబ్బరిపాలను తీసుకుని అందులో అవకాడో లేదా ఆలివ్ ఆయిల్‌ను కలుపుకోవాలి. ఈ రెండింటిని కలిపి తలకు, చర్మానికి రాసుకుంటే జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది.
 
కొబ్బరిబోండాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. అందుచేత వేసవికాలంలో ప్రతిరోజు కొబ్బరినీళ్లలో దూదిని ముంచి ముఖానికి రాసుకుని 3 నిమిషాల పాటు నెమ్మదిగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల భానుడి ప్రతాపానికి నల్లగా మారిన చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. అరకప్పు కొబ్బరి పాలలో కొన్ని గులాబీ రేకులు, స్పూన్ తేనె కలిపి ఒక బకెట్ గోరువెచ్చటి నీళ్లలో వేసుకుని స్నానం చేయాలి. 
 
ఇలా చేయడం వల్ల శరీరానికి తగిన తేమ అందుకుని చర్మం కాంతివంతంగా మారుతుంది. చిక్కటి కొబ్బరిపాలలో కొన్ని తేనె చుక్కలు, రెండుస్పూన్ బియ్యపురవ్వ, బాదం నూనె కలిపి పాదాలకు పూతలా పట్టించి 10 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాస్తే పాదాలు మృదువుగా ఉంటాయి.
 
చెమటతో చర్మంపై మురికివలన మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. దీన్నుంచి బయటపడాలంటే కొబ్బరిపాలలో రెండు చుక్కుల నిమ్మరసం కలిపి 10 నిమిషాల తరువాత అందులో దూదిని ముంచి ముఖమంతా అదించాలి. తరువాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకున్న దుమ్ము పోయి చర్మం తాజాగా ఉంటుంది.