శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (14:41 IST)

ఉదయాన్నే హాట్ ఛాయ్ వద్దు గ్లాస్ నిమ్మరసమే ముద్దు..

చాలామంది ఉదయాన్నే ఒక హాట్‌కప్ కాఫీ లేదా గరం చాయ్‌తో మెుదలుపెడతారు. కాఫీ, టీలు నిద్రమత్తును వదిలించి యాక్టివ్ చేయడంలో సఫలీకృతమవుతాయి. కానీ ఆరోగ్యపరంగా ఇంతకంటే మంచి పానీయం వుంది. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని త్రాగితే చాలా ప్రయ

చాలామంది ఉదయాన్నే ఒక హాట్‌కప్ కాఫీ లేదా గరం చాయ్‌తో మెుదలుపెడతారు. కాఫీ, టీలు నిద్రమత్తును వదిలించి యాక్టివ్ చేయడంలో సఫలీకృతమవుతాయి. కానీ ఆరోగ్యపరంగా ఇంతకంటే మంచి పానీయం వుంది. ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని త్రాగితే చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
నిమ్మలో ఉండే అల్కలైన్ లక్షణాలు శరీరంలోని టాక్సిక్‌లను నిర్మూలిస్తుంది. నిమ్మ అసిడిక్‌గా అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరంలో పీహెచ్ విలువలను సమతుల్యం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. మెరుగైన జీర్ణక్రియకు నిమ్మరసం త్రాగడం వలన గాస్ట్రో సిస్టం మెరుగుపడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు ఇతర మినరల్స్‌ను గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం మెరుగుపడడంతో పాటుగా వ్యాధులకు దూరంగా ఉండవచ్చును. 
 
నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ప్రత్యేక ఫైబర్ పదార్థం వలన సులభంగా బరువు తగ్గవచ్చు. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడి ఆకలి నియంత్రణకు దారితీస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాస్ నిమ్మరసం త్రాగడం వలన ఉదరానికి మేలు జరుగుతుంది. ముందురోజు మసాలాలు, జంక్‌ఫుడ్ వంటివి తిన్నవారు మరుసటి రోజు ఉదయం పరగడుపున నిమ్మరసం తాగడం ద్వారా అల్సర్‌ను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.