క్యాబేజ్ రసం తీసుకుంటే హార్మోన్లకు ఎంత మేలో తెలుసా?
ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆహార ప్రణాళికను తెలివిగా ఎంపికచేసుకోవడం అనేది, బరువు తగ్గడంలో, ఊబకాయం, ఇతర సంబంధిత వ్యాధులను నివారించడంలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఆహారప్రణాళికలో భాగంగా తీసుకునే పానీయాలు, పండ్లరసాలు మరింత దోహదపడుతాయి. ఈ ఊబకాయం తగ్గి
ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా ఆహార ప్రణాళికను తెలివిగా ఎంపికచేసుకోవడం అనేది, బరువు తగ్గడంలో, ఊబకాయం, ఇతర సంబంధిత వ్యాధులను నివారించడంలో మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. ఆహారప్రణాళికలో భాగంగా తీసుకునే పానీయాలు, పండ్లరసాలు మరింత దోహదపడుతాయి. ఈ ఊబకాయం తగ్గించుటలో క్యాబేజీ ఎంతో సహాయంచేయగలదు. క్యాబేజీ మీ శరీరానికి పోషకాలతో నింపడమే కాకుండా అతి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది.
క్యాబేజీ రసంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఖచ్చితమైన బరువును తగ్గించే గొప్ప పానీయమవుతుంది. ఒక కప్పు క్యాబేజీ రసంలో మెుత్తం 22 కేలరీలు, 0.09 గ్రాముల క్రొవ్వును కలిగిఉంటుంది. ఒక సంవత్సరకాలంపాటు వారానికి ఒకసారి క్యాబేజీ రసం త్రాగడం వల్ల శరీరం సుమారుగా 1.5 పౌండ్ల బరువును తగ్గిస్తుంది.
క్యాబేజీ రసంలో విటమిన్-సి, ఏ, బి1, బి2, బి6, ఇ, కే వంటి ముఖ్యమైన విటమిన్లు మాత్రమే కాకుండా, కాల్షియం, ఐరన్, పొటాషియం, అయోడిన్, సల్ఫర్, పాస్పరస్ వంటి అనేక ఖనిజాలను కలిగిఉంటుంది. క్యాబేజీలో సల్ఫోరఫేన్, ఇండోల్-3-కార్బినోలే వంటి క్యాన్సర్ వ్యతిరేక సమ్మేళనాలున్నాయి. ఇది శరీరంలోని విషాలను తొలగించి హానికరమైన హార్మోన్లను తొలగిస్తుంది.