గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 25 జనవరి 2019 (12:14 IST)

మహిళలు రోజూ తింటున్నారో లేదో కానీ పార్లర్లకు వెళ్తుంటారు.. ఏం చేయాలి?

మహిళలు అందంగా కనిపించాలి.. పార్లర్లకు వెళ్లుతుంటారు. తినే ఆహారానికి అయ్యే ఖర్చుకంటే.. ఈ బ్యూటీ పార్లర్లకే ఎక్కువగా అవుతుంది. రోజూ వేళకి తింటున్నారో లేదో కానీ పార్లర్లకు మాత్రం తప్పకుండా వెళ్తుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా అందమైన చర్మాన్ని పొందాలంటే.. ఈ 3 టిప్స్ పాటించాలని చెప్తున్నారు. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దాం.. 
 
నిమ్మ, తులసి ఆకుల రసాన్ని సమపాళ్ళల్లో తీసుకుని రోజుకు రెండుసార్లు ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకున్న తరువాత అరగంట పాటు అలానే ఉండాలి. ఆ తరువాతు గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు, మూడుసార్లు క్రమంగా చేస్తే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది. 
 
పాల ఉత్పత్తులలో మీగడ ఒకటి. దీనితో ప్యాక్ వేసుకుంటే... ఎలా ఉంటుందో చూద్దాం.. ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్ల మీగడ, కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆపై ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తే ముఖం తాజాగా మారడమే కాకుండా మృదువుగా తయారవుతుంది.
 
కలబంద గుజ్జు తీసుకుని అందులో కొద్దిగా మజ్జిగ లేదా బంగాళాదుంప రసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆపై ముఖాన్ని ఓ 5 నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇక నీటితో కడుక్కోవాలి. ఇలా ఓ 5 రోజులు క్రమం తప్పకుండా చేస్తే ముఖం అందంగా తయారవడమే కాకుండా.. ముఖం సౌందర్యాన్ని సంతరించుకుంటుంది.