శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2016 (18:21 IST)

జీలకర్ర, క్యాబేజీ మరిగించిన నీటితో ముఖం కడుక్కుంటే?

ఉద్యోగినులు సౌందర్యంపై ఎక్కువ దృష్టి పెట్టరు. ఇంటిపని, కార్యాలయ పనుల్లో తలమునకలై.. సౌందర్యంపై దృష్టి పెట్టరు. అలాంటివారు మీరైతే ఈ చిన్ని చిన్ని చిట్కాలతో మెరుగైన అందాన్ని పొందండి అంటున్నారు.. బ్యూటీషన

ఉద్యోగినులు సౌందర్యంపై ఎక్కువ దృష్టి పెట్టరు. ఇంటిపని, కార్యాలయ పనుల్లో తలమునకలై.. సౌందర్యంపై దృష్టి పెట్టరు. అలాంటివారు మీరైతే ఈ చిన్ని చిన్ని చిట్కాలతో మెరుగైన అందాన్ని పొందండి అంటున్నారు.. బ్యూటీషన్లు. మీగడలో బ్రెడ్‌ముక్కల్ని కలిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే జిడ్డు తొలగిపోతుంది. ముఖ సౌందర్యం మెరుగవుతుంది. 
 
అలాగే చర్మానికి మంచి చేసే గుణం నిమ్మలో పుష్కలం. 'విటమిన్ సి'తో పాటు చర్మం మీద పేరుకున్న మురికిని తొలగిస్తుంది. అందుకే రోజూ ఉదయం కాసింత నిమ్మరసం ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. 
 
ఇక జీలకర్ర, క్యాబేజీ జీర్ణశక్తికే కాదు. మేని మెరుపుకు తోడ్పడతాయి. ఈ రెండింటినీ నీటిలో వేసి కాసేపు ఉడికించాలి. ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక.. ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేస్తే ముడతలు తగ్గిపోతాయి. మొటిమలు దూరమవుతాయి. నిత్యయవ్వనులుగా కనిపిస్తారు. పొద్దుతిరుగుడు పువ్వు గింజల్ని రాత్రి పూట పచ్చిపాలలో నానబెట్టి రుబ్బాలి. ఇందులో చిటికెడు కుంకుమపువ్వు, పసుపు కలిపి రాసుకుంటే మెరుగైన చర్మకాంతిని పొందవచ్చు. 
 
అలాగే కోడిగుడ్డులోని తెల్లసొనకు తేనే జత చేస్తే ముఖానికి మంచి ఫేస్‌ప్యాక్ తయారవుతుంది. తెల్లసొన, తేనే కలిపిన ఈ ప్యాక్ వేసుకుని ఇరవై నిమిషాలు ఉంటే ముఖం మెరుస్తుంది. ఆలు, టమోటో రసాన్ని పొద్దున్నే ముఖానికి రాసుకుంటే చర్మం నిగనిగలాడిపోతుంది.