శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 జులై 2020 (13:41 IST)

మందార పువ్వులు సౌందర్యం.. కొబ్బరినూనెలో నానబెట్టి?

మందార పువ్వులు సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. కొబ్బరినూనెలో మందార‌ పూలను వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జట్టు ఒత్తుగా పెరుగుతుంది. మందార పూలు తీసుకుని పేస్ట్‌ చేసి, దానికి ఆముదం కలిపి తలకు పట్టించాలి. త‌ర్వాత చల్లని నీటితో తల స్థానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా ఉండటంతో పాటు బలంగా ఉండి, ఒత్తుగా పెరుగుతుంది.
 
మందారపువ్వు పేస్ట్‌లో శెనగపిండి, పెరుగును క‌లిపి మెత్తగా చేసుకోవాలి. ఈ పేస్ట్ తలకు ప‌ట్టించి, కొంత స‌మ‌యం త‌ర్వాత‌ శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. మందారం ఆకులు, గోరింటాకు కొబ్బరినూనెలో వేసి నూనె కాగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిల్వ ఉంచుకుని తలకు పట్టిస్తే జట్టురాలే సమస్య తగ్గుతుంది.
 
మందారం పువ్వును వాటర్‌తో మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని తలకు అప్లై చేసి గంట షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.