వేసవిలో నిమ్మకాయ, అందానికి మెరుగులు

సోమవారం, 16 మార్చి 2020 (21:30 IST)
వేసవి రాగానే నిమ్మకాయల అవసరం ఎక్కువయిపోతుంది. నిమ్మరసం తాగితే నీరసం అంతా ఎగిరిపోతుంది. నిమ్మతో ఆరోగ్యమే కాదు అందం కూడా పెంచుకోవచ్చు. నిమ్మకాయ రసంలో అనేక సౌందర్య చిట్కాలు దాగివున్నాయి. ముఖ్యంగా నిమ్మకాయ రసం ముఖంతో పాటు.. శరీరంపై ఉన్న మచ్చలు పోగొట్టడంలో ఔషధంగా పనిచేస్తుంది. 
 
ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని పిండుకుని దూదితో మొటిమలు, మచ్చలపై రాస్తే ముఖంలోని ఆ మచ్చలు మాయమవుతాయి. ప్రతిరోజూ ఐదు నిమిషాల పాటు నిమ్మరసాన్ని అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
అలాగే శరీర చర్మంపై ఏర్పడే చికెన్ ఫాక్స్ మచ్చలు పోవాలంటే కూడా నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే మంచిదని వారు చెబుతున్నారు. ఇంకా చికెన్ ఫాక్స్ మచ్చలు మాయమవ్వాలంటే పసుపు, కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంలోని చికెన్ ఫాక్స్ మచ్చలపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
ఇక పింపుల్స్ పూర్తిగా తొలగిపోవాలంటే నిమ్మరసాన్ని దూదితో అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయండి మీ చర్మం మిలమిల మెరిసిపోతుంది. ఇంకా కొద్ది రోజులు ఇలా చేస్తే పింపుల్స్ ఉండవని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
అలాగే బొప్పాయి చెట్టు నుంచి వచ్చే పాలను కాసింత తీసుకుని అందులో నీటిని చేర్చండి. ఈ బొప్పాయి పాలు, నీటి మిశ్రమంలో నానబెట్టిన జీలకర్రను కలపండి 15 నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే ముఖంలోని మచ్చలు మటుమాయం అవుతాయి. 

అన్నీ చూడండి

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments