1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (23:02 IST)

కళ్ల కింద నల్లటి చారలు వుంటే ఇలా చేసి చూడండి

పెరట్లో దొరికే బాగా ముదిరిన జామ ఆకుల్ని తీసుకుని వేడినీటిలో కాసేపు మరగ బెట్టాలి. నీరు కొంచెం ఆవిరయ్యాక.. ముదురు ఎరుపు రంగులోకి చేరుకున్నాక దించేయాలి. 

 
కాసేపు చల్లారిన తర్వాత గోరు వెచ్చని ఆ నీటితో మెత్తని దూదిని ముంచి ముఖం మీద అద్దుకోవాలి. మొటిమలు పుండుగా మారితే ఆ ప్రాంతాన్ని వదిలేయడం మంచిది. మిగిలిన చోట అద్దాలి. కళ్ల కింది నల్లచారలు ఉన్నచోట వారానికి రెండుసార్లు ఇలా చేస్తే సమస్య తగ్గిపోతుంది. 

 
ఇన్ఫెక్షన్ల వల్ల ముఖం మీద ఎరుపు కురుపులొచ్చినా వాటి మీద ఈ జామ ఆకుల నీటిని అద్దితే అక్కడున్న బ్యాక్టీరియా చనిపోతుంది. ముఖం మీద ఏర్పడిన మృతకణాల తొలగింపునకు కూడా ఇదొక చక్కటి పరిష్కారం. మెడచుట్టూ చర్మం నలుపెక్కినా అక్కడ కూడా ఈ నీటిని దూదితో అప్లై చేసుకోవచ్చు.