సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (17:09 IST)

మహిళలు చర్మ నిగారింపు కోసం విటమిన్ ఇ క్యాప్సూల్ వాడాలట..

చర్మం నిగారింపును సంతరించుకోవాలంటే.. విటమిన్ ఇ క్యాప్సూల్ వాడాలి. విటమిన్ ఇ క్యాప్సూల్స్ వాడకంతో, కొత్త కణాలు ఏర్పడతాయి. ఇది మనకు మెరిసే ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. విటమిన్ ఇ క్యాప్సూల్స్‌తో పాటు కొన్ని పదార్థాలను ముఖానికి అప్లై చేయడం వల్ల అందమైన, మృదువుగా, మెరిసే చర్మాన్ని పొందవచ్చు. 
 
గ్లోయింగ్ స్కిన్ కోసం, 3-4 విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకుని, ఒక కప్పు బొప్పాయి పేస్ట్, ఒక టీస్పూన్ తేనె కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ వరకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత ముఖం కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయి.
 
నల్లటి వలయాలను వదిలించుకోవడానికి రెండు విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ను తీసుకుని దాని నూనెను కళ్ల చుట్టూ రాసుకోవాలి. ఆ తర్వాత తేలికగా మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం చల్లటి నీటితో మీ ముఖాన్ని కడిగేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు తొలగిపోతాయి.