మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 8 జూన్ 2022 (23:14 IST)

కొబ్బరి నూనె స్త్రీలు అలా అప్లై చేస్తే చెడు ఫలితాలు...

Coconut oil
చాలామంది కొబ్బరి నూనెను ముఖానికి అప్లై చేస్తుంటారు. వాస్తవానికి ముఖానికి కొబ్బరి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే ఇది ముఖంపై మొటిమల సమస్యను కలిగిస్తుంది. ముఖంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

 
జిడ్డు చర్మం ఉన్నవారు కొబ్బరి నూనెతో ముఖానికి మసాజ్ చేయకూడదు. ఇది చర్మం మెరుపును తగ్గిస్తుంది. దీనితో ముఖం అందవిహీనంగా మారుతుంది.

 
కొబ్బరినూనెను అప్లై చేయడం వల్ల ముఖంపై వెంట్రుకలు బాగా పెరుగుతాయి. పెరిగితే ముఖం నుండి తొలగించడం కష్టం. ముఖ్యంగా మహిళలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.

 
ఆయిలీ స్కిన్ ఉన్నవారు కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే స్కిన్ అలర్జీకి కారణం అవుతుంది. ఇది ముఖంపై మచ్చలు ఏర్పడటానికి దారి తీస్తుంది.