1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (22:49 IST)

చర్మానికి-కేశాలకు కుంకుమపువ్వుతో జరిగే మేలు

కుంకుమపువ్వుతో సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది. కుంకుమపువ్వు అనేది పిగ్మెంటేషన్, బ్రౌన్ స్పాట్స్, ఇతర చర్మపు మచ్చలను తగ్గించడంలో సహాయపడే సహజ పదార్ధం. ఇది చర్మం వేగంగా కోలుకోవడానికి సహాయపడే వైద్య లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

 
కుంకుమపువ్వులో కెంప్ఫెరోల్, క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్ భాగాలు ఉన్నాయి. ఇవి గాయం నయ చేయడానికి, గాయాలు తాలూకు మచ్చలు పోవడానికి  సహాయపడతాయి. కుంకుమపువ్వు ఇతర ఫినాలిక్ భాగాలు ఫోటోప్రొటెక్టివ్‌గా చేస్తాయి. అనేక సన్‌స్క్రీన్‌లు, స్కిన్ క్రీమ్‌లలో కూడా ఉపయోగించబడతాయి.

 
ప్రకృతి అనేది మన కష్టాలను త్వరితగతిన పరిష్కరించడంలో సహాయపడే నివారణల నిధి. మరోవైపు, రసాయనికంగా కలిపిన ఉత్పత్తులు చర్మం, జుట్టు సహజ ఆకృతికి హాని కలిగిస్తాయి. అలాగే వాటి సహజ కాంతిని తీసివేస్తాయి. కాలుష్యం, దుమ్ము మన చర్మం- జుట్టుకు హాని కలిగిస్తుంది. కనుక చర్మం- జుట్టు కోసం కుంకుమపువ్వు వాడటం చాలా అవసరం.