సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 మార్చి 2018 (13:25 IST)

ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతాల నిశ్చితార్థం.. ఆకాశ్ చేతిలో శ్లోకా చెయ్యేసి?

రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ.. త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. ఈ మేరకు రస్సెల్, మోనా మెహతా దంపతుల కుమార్తె శ్లోకా మెహతాను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు ఆక

రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ.. త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. ఈ మేరకు రస్సెల్, మోనా మెహతా దంపతుల కుమార్తె శ్లోకా మెహతాను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు ఆకాశ్ అంబానీ, శ్లోకా నిశ్చితార్థం గోవాలో శనివారం అట్టహాసంగా జరిగింది. ముకేశ్ అంబానీ దంపతులు అటు రస్సెల్ మెహతా దంపతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 
 
ఆకాశ్ ఎడమ చేతిపై శ్లోకా తన ఎడమ చేతిని వుంచి అడుగులు వేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వివాహ తేదీ ఇంకా ఖరారు కాలేదు.శ్లోకా మెహతా, ఆకాశ్ అంబానీ ఇద్దరూ క్లాస్‌మేట్స్. స్నేహితులైన వీరిద్దరూ త్వరలో వివాహ బంధంతో దంపతులు కానున్నారు. 
 
ఈ విషయమై ఆకాశ్ తల్లి నీతా అంబానీ స్పందిస్తూ..  శ్లోకా నాలుగేళ్ల వయసు నుంచి తనకు బాగా తెలుసునని.. ఆమెను తమ కుటుంబంలోకి రావడం ఎంతో ఆనందంగా వుందని.. ఆమెను తమ కుటుంబంలోకి సాదరంగా స్వాగతిస్తున్నామని తెలిపారు.