1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 10 జూన్ 2022 (23:07 IST)

భారతదేశంలోని బెంగళూరులో కన్స్యూమర్‌ రోబోటిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను తెరిచిన అమెజాన్‌

Amazon astro
బెంగళూరులో కన్స్యూమర్‌ రోబోటిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను  అమెజాన్‌ తెరిచింది. అమెజాన్‌ యొక్క కన్స్యూమర్‌ రోబోటిక్స్‌ డివిజన్‌కు మద్దతునందించడంలో ఈ సైట్‌ సహాయపడనుంది. ఇది గత సంవత్సరమే తమ మొదటి రోబో, అస్ట్రోను విడుదల చేసింది. 

 
నూతన మరియు వినూత్నమైన రోబో ఆస్ట్రో. ఇంటి పర్యవేక్షణ, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటం వంటి అనేక అంశాలలో వినియోగదారులకు  సహాయపడేటటువంటి రీతిలో దీనిని రూపొందించాము. ఇది కృత్రిమ మేథస్సు, కంప్యూటర్‌ విజన్‌, సెన్సార్‌ టెక్నాలజీ మరియు వాయిస్‌, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌ వంటి అంశాలలో  అత్యాధునిక ఆవిష్కరణలను ఒక ప్యాకేజీ రూపంలో తీసుకురావడంతో పాటుగా వినియోగదారులకు సహాయకరంగా, సౌకర్యవంతంగా ఉండేలా  రూపొందించింది.

 
‘‘గత సంవత్సరం మేము మొట్టమొదటి కన్స్యూమర్‌ రోబోను విడుదల చేశాము. కానీ ఖచ్చితంగా అది మా చివరి రోబో మాత్రం కాదు. ఈ నూతన కన్స్యూమర్‌ రోబోటిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ మా వృద్ధి చెందుతున్న కన్స్యూమర్‌ రోబోటిక్స్‌ డివిజన్‌కు సహాయపడటంతో పాటుగా ప్రపంచ శ్రేణి సాంకేతిక ఉత్పత్తులపై పనిచేసేందుకు అత్యున్నత ప్రతిభావంతులనూ ఆకర్షించనుంది.  ఆవిష్కరణల కేంద్రం భారతదేశం; ఇక్కడ మా కేంద్రం ఏర్పాటుచేయడం వల్ల  ప్రపంచవ్యాప్తంగా మా వినియోగదారులకు అత్యుత్తమ కన్స్యూమర్‌ రోబోటిక్స్‌ అనుభవాలను సృష్టించడంలో అమెజాన్‌కు తోడ్పడుతుంది’’– కెన్‌ వాషింగ్టన్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, కన్స్యూమర్‌ రోబోటిక్స్‌, అమెజాన్‌ అన్నారు.