శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 ఆగస్టు 2024 (22:16 IST)

ఆఫ్రికాలో వ్యాపార అవకాశాలపై సదస్సును నిర్వహించిన అసోచామ్ ఆంధ్రప్రదేశ్

image
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఎరైజ్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ప్లాట్‌ఫారమ్స్ (ARISE IIP) సహకారంతో 14, ఆగస్టు 2024న ఎరైజ్( ARISE)లో వ్యాపార అవకాశాలపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. విజయవాడలోని నోవొటెల్ విజయవాడ వరుణ్ హోటల్‌లో జరిగిన ఈ సదస్సు, ఆఫ్రికాలోని అవకాశాలతో భారతీయ వ్యాపారాలను అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 
 
ఆఫ్రికా అందించే లాభదాయక అవకాశాలను అన్వేషించడానికి 80 కంటే ఎక్కువ కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఆఫ్రికా, ఇతర దేశాలలో అందుబాటులో ఉన్న విభిన్న వ్యాపార, పెట్టుబడి అవకాశాలపై సమాచారం, ఈ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాముఖ్యత, ఆర్థిక సామర్థ్యాన్ని వెల్లడించారు. ఆఫ్రికాలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించటం వల్ల కలిగే ప్రయోజనాలు, అంతర్జాతీయ మార్కెట్‌లలో తమ వ్యాపార సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలో నిపుణులు వెల్లడించారు. 
 
ఎపి అండ్ టిజి బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ శ్రీ ఎకె ప్రమోద్ కుమార్ కె ఈ కార్యక్రమం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ, “ఈ సెషన్ భారతీయ వ్యాపారాలకు ARISE IIP నుండి అధికారులతో నేరుగా సమావేశం కావడానికి, ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించడానికి అవసరమైన పరిజ్ఞానం పొందడానికి ఒక ప్రత్యేక వేదికను అందించిందన్నారు. దాదాపు 80కు పైగా కంపెనీలు పాల్గొనటం ఈ ప్రాంతంపై పెరుగుతున్న ఆసక్తిని చూపుతుందని అభిప్రాయ పడ్డారు.  
 
శ్రీ హితేష్ నాగరాజయ్య, హెడ్ బిజినెస్ డెవలప్‌మెంట్ - బెనిన్, ఆఫ్రికా ARISE IIP గురించి హాజరైన వారికి వివరించారు. అసోచామ్ స్టేట్ హెడ్-ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ, శ్రీ మచ్చా దినేష్ బాబు మాట్లాడుతూ, ఆఫ్రికాలో వున్న అపార అవకాశాలు, వ్యూహాత్మక ప్రయోజనాలు వంటివి  వైవిధ్యాన్ని కోరుకునే పెట్టుబడిదారులకు దీనిని తిరుగులేని గమ్యస్థానంగా మార్చాయన్నారు.