గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 అక్టోబరు 2024 (13:51 IST)

రూ. 82వేల మార్కును తాకిన బంగారం ధరలు..

gold
దీపావళి సందర్భంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. తొలిసారి పది గ్రాముల బంగారం ధర రూ. 82వేల మార్కును దాటేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. బంగారం ధరలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం కొనుగోలు చేసే సమయంలో ఈ ధరల్లో కొంత తేడా ఉండే అవకాశం ఉంది. 
 
మంగళవారం ముగింపుతో పోల్చితే మంగళవారం ఒక్క రోజే ఏకంగా రూ.1000 పెరిగి రూ.82,400కు చేరుకుంది. దీపావళి సందర్భంగా వర్తకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడమే ధరల పెరుగుదలకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. 
 
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 81,160గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,400గా ఉంది.