బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 నవంబరు 2024 (16:26 IST)

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. సూపర్ యాప్ వచ్చేస్తోంది.. తెలుసా?

train
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ సరికొత్తగా సూపర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తొంది. ఈ సూపర్ యాప్‌ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేస్తున్నట్లు ఇండియన్  రైల్వే వర్గాలు తెలిపాయి. 
 
ఇప్పటికే యాప్ సిద్ధమైందని, దానిని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఇండియన్ రైల్వేస్ కు చెందిన ఒక అధికారి చెప్పినట్లు తెలుస్తొంది. 
 
ఫలితంగా టికెట్ బుక్కింగ్, పీఎన్ ఆర్ స్టేటస్, ట్రాకింగ్ వ్యవస్థను ఈ యాప్ ద్వారా అందుబాటులోకి రానుంది. డిసెంబర్ నాటికి ఈ సూపర్ యాప్‌ను ఇండియన్ రైల్వేస్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా రైల్వే ప్రయాణీకులకు అన్నిరకాల సదుపాయాలు సులభతరం కానున్నాయి.