ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 నవంబరు 2023 (23:11 IST)

మాన్యావర్ బ్రాండ్‌కు అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

Ram Charan
భారతదేశంలో పురుషుల ఫ్యాషన్ సెలబ్రేషన్ వేరే బ్రాండ్ అనగానే అందరికి గుర్తుకువచ్చే అగ్రగామి బ్రాండ్ మాన్యావర్. అలాంటి ఈ బ్రాండ్ ఇప్పుడు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ప్రకటించింది. ఇది పెళ్లిళ్లు, పండుగల సీజన్. ఈ సీజన్లో తమ ఉత్పత్తులను మరింత మందికి చేరవేసేందుకు TaiyaarHokarAiye అనే కొత్త క్యాంపెయిన్‌ను మాన్యావర్ మొదలుపెట్టింది. సమకాలీన భారతదేశ యొక్క స్వరూపాన్ని... ఇంకా చెప్పాలంటే దేశం యొక్క సంస్కృతి సంప్రదాయలను ప్రతిబింబించేలా ఉంటారు రామ్ చరణ్. ఆయన ఎలా అయితే మన సంప్రదాయాలకు నిలువుటద్దంలా కన్పిస్తారో, అలాగ మాన్యావర్ కూడా అలాంటి ఆలోచనలతోనే ఎల్లప్పుడూ ముందుకు వెళ్తుంటుంది. అంతేకాకుండా రామ్ చరణ్ యొక్క తేజస్సు, అపారమైన ప్రజాదరణ మాన్యావర్ యొక్క గొప్ప సాంస్కృతిక సౌందర్యం, వారసత్వానికి వినూత్న కోణాన్ని తీసుకువస్తాయి.
 
ఈ క్యాంపెయిన్ ఫిల్మ్ తండ్రీ కొడుకుల బంధం గురించి అద్భుతంగా ఆవిష్కరించేలా ఉంటుంది. ఒక తండ్రి తన కుమారుని వివాహ సన్నాహాల్లో పూర్తిగా మునిగిపోవడాన్ని చూపిస్తుంది. కొడుకు ఆనందకరమైన జీవితాన్ని తండ్రి మెచ్చుకుంటున్నప్పుడు, అతని హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఎన్నో ఏళ్లుగా ఎంతో విలువైన క్షణాలను అందించిన తండ్రి ప్రేమ అమూల్యమైన ఆనందాన్ని ఇస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కుటుంబానికి మొదటి స్థానం ఇవ్వడం వరకు, ఈ ఫిల్మ్ తండ్రి- కొడుకుల మధ్య రోజురోజుకి మరింతగా బలపడుతున్న అనుబంధాలను చూపిస్తుంది. ఇది మార్గదర్శకత్వం, బాధ్యత, అవగాహన యొక్క శాశ్వతమైన కుటుంబ విలువలకు ప్రతీక. ఇది మీకు శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది. కొడుకు తన పెళ్లికి సిద్ధమవుతున్నప్పుడు, అతను తన తండ్రి అందించిన అపారమైన జ్ఞానం, ప్రేమను తనతో తీసుకువెళతాడు, ముందుకు సాగే అద్భుతమైన ప్రయాణానికి అతన్ని సిద్ధం చేస్తాడు. ఇది నిస్సందేహంగా అందర్నీ కదిలిస్తుంది, అనుభవించేలా చేస్తుంది.
 
ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, "భారతదేశంలో పండుగ సీజన్లో పురుషులు వేసుకునే దుస్తులు అనగానే గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ పేరు మాన్యావర్. అలాంటి మాన్యావర్ బ్రాండ్‌తో అనుబంధం కలిగి ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆవిష్కరణ, సంప్రదాయం, కుటుంబ విలువలకు మాన్యావర్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. నేను కూడా అంతే. ఈ భాగస్వామ్యం నాకు చాలా ప్రత్యేకమైనది. వివాహాలు- ఉత్సవాలు జరుపుకోవడం ఎల్లప్పుడూ గర్వం మరియు ఆనందాన్ని కలిగిస్తుంది. మాన్యవర్‌లో స్టైల్ స్టేట్‌మెంట్ చేయడం కంటే మెరుగైన మార్గం ఏమిటి అని అన్నారు ఆయన
 
ఈ సందర్భంగా వేదాంత్ ఫ్యాషన్స్ లిమిటెడ్ చీఫ్ రెవిన్యూ ఆఫీసర్ వేదాంత్ మోడీ మాట్లాడుతూ,"రామ్ చరణ్‌ను మాన్యావర్ కుటుంబానికి స్వాగతించడం మాకు గౌరవంగా ఉంది. భారతదేశ ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్, చరిష్మా, ఆకర్షణ మరియు గ్లోబల్ అప్పీల్ మాన్యావర్ డ్రెస్సింగ్ యొక్క దృష్టితో సంపూర్ణంగా సరిపోతాయి. రామ్ చరణ్‌తో, మా ప్రేక్షకులతో నిష్కళంకమైన అనుబంధాన్ని కలిగి ఉంటాడని మేము విశ్వసిస్తున్నాము" అని అన్నారు.