శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 ఆగస్టు 2021 (22:05 IST)

అమెజాన్: రెండు వ్యాపారాలను రీ-బిల్డింగ్ చేసుకుంటున్న హైదరాబాద్‌కు చెందిన సతీష్‌

జీవన ప్రయాణం కఠినంగా ఉన్నప్పుడు, మరోసారి జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు చాలా ధైర్యం అలాగే స్థిరత్వం అవసరం. హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యక్తి అచ్చంగా అలాగే చేశారు. మహమ్మారి తెచ్చిన అంతరాయాన్ని అధిగమించాలనే కృతనిశ్చయంతో ఉన్న సతీష్ మునిగల్‌ని భేటీ అవ్వండి. అమెజాన్‌ వారి ఐ హావ్ స్పేస్ ప్రోగ్రామ్‌ని అతను ఆశ్రయించగా, అది ఇప్పుడు అతనికి ఆర్థిక భద్రతను అందిస్తోంది.
 
మహమ్మారికి మునుపు 59 ఏళ్ల సతీష్ రెండు దుకాణాలను నిర్వహించేవారు. ఒకటి చీరలు అమ్మడం, మరొకటి పూజా సామగ్రిని విక్రయించడం. రెండు వ్యాపారాలు బాగానే ఉన్న సమయంలో మహమ్మారి ప్రారంభంతో 2020లో రాత్రికి రాత్రే విధించిన లాక్‌డౌన్‌తో ఈ దుకాణాల తలుపులు మూసివేయవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ, సతీష్‌కు ఉన్న పట్టుదలే అతను ధైర్యాన్ని కోల్పోకుండా నిలబెట్టింది. తన దుకాణాల వ్యాపారం నిలిచిపోవడంతో అదనపు ఆదాయ మార్గాలను సృష్టించుకునేందుకు అన్ని మార్గాలను పరిశీలించారు. ఈ సమయంలో, ఒక స్నేహితుడు ఆయనకు అమెజాన్ వారి ఐ హేవ్ స్పేస్ (IHS) ప్రోగ్రామ్‌ను పరిచయం చేయగా, ఆయన వెంటనే అందులో చేరారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.
 
ఐహెచ్‌ఎస్ (IHS) ప్రోగ్రామ్ అనేది అమెజాన్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఒక ప్రత్యేకమైన లాస్ట్ మైలు డెలివరీ ప్రోగ్రామ్ కాగా, ఇది స్థానిక స్టోర్లు లేదా వ్యాపార యజమానులు అమెజాన్‌తో భాగస్వామిగా ఉండటానికి, వారి ఖాళీ సమయంలో కస్టమర్లకు ప్యాకేజీలను అందించడం ద్వారా వారి ఆదాయాన్ని భర్తీ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇతర ఐహెచ్‌ఎస్ (IHS) భాగస్వాముల తరహాలోనే సతీష్ తన స్టోర్‌ల నుంచి 2-4 కిలో మీటర్ల పరిధిలో కస్టమర్‌లకు పికప్ మరియు డెలివరీ సేవలను అందించారు.
 
మొదట్లో అనుబంధ సంపాదన ఎంపికగా ప్రారంభమైన ఈ పని అనంతరం నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి జీవనోపాధిగా మారింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే అదనపు ఆదాయం ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు, అతని కుమార్తె చదువుకు ఆదా చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే ఆదాయం, ఆయన తన రెండు వ్యాపారాలను కొనసాగించేందుకు, తన దుకాణాలు రెండింటినీ నిర్వహించుకునేందుకు ఆయనకు శక్తినిచ్చాయి. నేడు, ఆయన స్టోర్లలో వ్యాపారం మెరుగుపడినప్పటికీ, సతీష్ జీవితంలో ఐహెచ్ఎస్ (IHS) ప్రోగ్రామ్ ఆయన నుంచి విడదీయలేని ఒక భాగంగా మారిపోయింది.
 
రద్దీ వేళల్లో, సతీష్ భార్య అనిత అతనికి స్టోర్‌ల నిర్వహణకు సహాయం చేస్తుండగా, స్టోర్‌లో రద్దీ లేని సమయంలో డెలివరీలు చేస్తూనే ఉన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ఐహెచ్‌ఎస్ (IHS) ప్రోగ్రామ్ నా ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు నాకు సహాయపడింది అలాగే, ఇప్పుడు నా స్టోర్‌లపై దృష్టి పెట్టేందుకు కూడా నాకు అవకాశాన్ని ఇస్తోంది. నేను ప్రోగ్రామ్‌లో చేరడానికి ఎటువంటి పెట్టుబడి పెట్టే అవసరం లేకుండానే IHS నా కుటుంబాన్ని ఆదుకోవడంలో సహాయపడింది.
 
నా జీవితంలో అత్యంత కష్ట సమయాల్లో నా స్టోర్‌ల వ్యాపారాన్ని కొనసాగించుకునేలా చేసింది. ఈ కార్యక్రమం ద్వారా నిరంతర సంపాదనతో నా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలనన్న విశ్వాసాన్ని ఇచ్చింది. చీరల వ్యాపారాన్ని మరింత విస్తరించుకునేందుకు అదే సమయంలో మా కుమార్తెల కోసం ఆదా చేసుకునేందుకు నా భార్య, నేను అదనపు ఆదాయాన్ని ఉపయోగించనున్నాము’’ అని వివరించారు.
 
మీరు IHS ప్రోగ్రామ్‌ను మరెవరికైనా సిఫారసు చేస్తారా అని అడిగినప్పుడు, ‘‘నేను ఈ విషయంలో రెండో సారి ఆలోచించను’’ అని సతీష్ తెలిపారు.