శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 23 ఆగస్టు 2021 (20:22 IST)

హైదరాబాదులో కుండపోత వర్షం, ఆశ్చర్యపోయిన నగరవాసులు

హైదరాబాద్ నగరాన్ని అకస్మాత్తుగా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఈ సాయంత్రం నగరంలో కుండపోత వర్షం కురిసింది. నగరంలో సోమవారం అనేక చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. మధ్యాహ్నం సమయంలో నగరంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెల్సియస్, ఇది అకస్మాత్తుగా కురిసిన వర్షాల తరువాత 26 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయింది.
 
ఖైరతాబాద్, ముషీరాబాద్, నాంపల్లి, ఆసిఫ్‌నగర్, అమీర్‌పేట, గోల్కొండతో సహా పలు ప్రాంతాల్లో సాయంత్రం వరకు 35.5 మిల్లీమీటర్ల వరకు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వర కాలనీ పరిసర ప్రాంతాల్లో సోమవారం అత్యధికంగా 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
ఆకస్మిక వర్షం ఆశ్చర్యానికి గురిచేశాయి, అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వచ్చే రెండుమూడు రోజులపాటు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.