బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:49 IST)

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం... అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. దీంతో కొత్త నిబంధనలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో, వాటివల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఓసారి పరిశీలిద్ధాం.
 
పీఎఫ్ ఖాతాపై పన్ను... కేంద్ర ప్రత్యక్ష బోర్డు పన్నుల బోర్డు ఐటీ నిబంధన 25వ సవరణ 2021 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్లే మొత్తాల్లో రూ.2.5 లక్షల వరకే పన్ను ఉండనుంది. అది దాటితే వడ్డీ ఆదాయంపై పన్ను వర్తిస్తుంది. 
 
పాన్ కార్డు లింకేజీపై జరిమానా... పాన్ కార్డుకు ఆధార్ నంబరు లింకు చేయకపోతే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జరిమానా చెల్లించాల్సివస్తుంది. మొదటి ముూడు నెలలు రూ.500, ఆ తర్వాత 9 నెలలు రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 2023 మార్చి 31వ తేదీలోగా ఆధార్ లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదు. ఆ పాన్ కార్డు ఇన్ యాక్టివ్‌గా మారుతుంది. ఆ పాన్ కార్డు లావాదేవీల్లో ఉపయోగించడానికి వీల్లేదు. 
 
ఐటీ రిటర్నులు... ఐటీ రిటర్నుల్లో తప్పులు జరిగినట్టయితే చెల్లింపుదారులు అప్‌డేట్ చేసిన రిట్నర్నును దాఖలు చేయాల్సి ఉంటుంది. సంబంధిత మదింపు సంవవత్సరం ముగిసిన రెండేళ్ళ లోపు ఈ వెసులుబాటును కల్పించారు. 
 
ఎన్పీఎస్ కోతలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా తమ కనీస వేతనం డీఏలో 14 శాతం వరకు కంపెనీ ఎన్పీఎస్ నిధి కోసం సెక్షన్ 80సీసీడీ (2) కింద కోతలకు క్లెయిన్ చేసుకోవచ్చు. 
 
జీఎస్టీ మార్పు... పరోక్ష పన్నులు, కష్టమ్స్ కేంద్ర బోర్డు రూ.20 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారులను బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానికి ఇన్వాయిస్‌లను తీయాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు రూ.50 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారులకే ఇది వర్తిస్తూ వచ్చింది. వీటితో పాటు అనేక నిబంధనలు అమల్లోకి వచ్చాయి.