మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (13:43 IST)

01-04-2022 నుంచి 30-04-2022 వరకు మీ మాస ఫలితాలు

మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ మాసం శుభాశుభ మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థికంగా లోటు లేకున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం సర్దుబాటువుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. వ్యతిరేకులతో జాగ్రత్త. గృహ మరమ్మతులు చేపడతారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులకు కష్టకాలం. అధికారులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. 
 
 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు 
ఈ మాసం ప్రథమార్ధం యోగదాయకం. కార్యం సిద్ధిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. ద్వితీయార్ధంలో దుబారా ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఆశించిన పదవులు దక్కవు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. గృహమార్పు అనివార్యం. వ్యవహారాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు స్థానచలనం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకలకు హాజరవుతారు. 
 
 
 
మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. రుణ బాధలు తొలగుతాయి. ఆందోళన తగ్గికుదుటపడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. కీలక పత్రాలు అందుకుంటారు. నిర్మాణాలు వేగవంతమవుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. కొనుగోలుదార్లలతో జాగ్రత్త. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.
 
 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. విమర్శలు మీలో పట్టుదలను పెంచుతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తలు వింటారు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. ఉపాధి పథకాలు చేపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. 
 
 
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. ఆలోచనలు నిలకడగా ఉండవు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. మనోధైర్యంతో వ్యవహరించండి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు, ధరలు ఆందోళన కలిగిస్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయులతో సంభాషణ ఉల్లాసం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్మాత్మికత పెంపొందుతాయి. వ్యాపారాల్లో ఇబ్బందులెదురవుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. ఒత్తిళ్లు, ధనప్రలోభాలకు లొంగవద్దు. 
 
 
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ధనమూలక సమస్యలెదురవుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాస్తుకు అనుగుణంగా మార్పులు చేపడతారు. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
 
 
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ఆదాయానికి లోటు లేకున్నా సంతృప్తి ఉండదు. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పట్టుదలతో యత్నాలు సాగించండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. అవివాహితులకు శుభయోగం. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. భాగస్వామిక వ్యాపారాలకు అనుకూలం. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రయాణంలో జాగ్రత్త. 
 
 
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. స్థిరాస్తి కొనుగోలు దిశగారాయి. సందేశాలు, ప్రకటనలను విశ్వసించవద్దు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. 
 
 
 
ధనుస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం 
సత్కాలం ఆసన్నమైంది. ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేయాలి. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. బాధ్యతలు అప్పగించవద్దు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. న్యాయ, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు. పందాలు, జూదాలకు పాల్పడవద్దు.
 
 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. వ్యవహారానుకూలత ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. పెద్దల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సంయమనం పాటించండి. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం, విద్యార్థులకు ఒత్తిడి ఆందోళన. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులు, కార్మికులకు కష్టకాలం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
 
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు 
ఆర్థికస్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అధికం, సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అయిన వారి రాక ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. సంతానం మొండివైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. కార్మికులు, బిల్డర్లకు కష్టకాలం. వ్యాపారాల్లో ఒడిదుడుకులెదురవుతాయి నూతన పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. 
 
 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
అనుకూలతలు అంతంత మాత్రమే. ఏ పని చేసినా మొదటికే వస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రుణ బాధలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అవసరానికి ధనం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. సంతానం చదువులపై మరిత శ్రద్ధ వహించాలి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ముఖ్యమైన పత్రాలు జాగ్రత్త. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు ఏమంత స్పందన ఉండదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. ఉద్యోగవిరమణ చేసిన వారికి వీడ్కోలు పలుకుతారు.