శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 మే 2020 (20:20 IST)

ఒకినోవా డీలర్‌ మార్జిన్‌ను ప్రతి అమ్మకానికి 11శాతానికి పెంచింది

ఒకినోవా- భారతదేశపు ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘మేక్ ఇన్ ఇండియా’పై ఫోకస్‌తో తన డీలర్ మార్జిన్‌లను ప్రతి అమ్మకంపై 11% శాతానికి పెంచింది. కొవిడ్-19 తీవ్రంగా వ్యాప్తి చెందడంతో, చాలా సంస్థలు మరియు వ్యక్తులు ఖర్చు తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించారు. ఒకినోవా ప్రతి అమ్మకంపై డీలర్ మార్జిన్‌ని 8% నుంచి 11%కు పెంచుతున్నట్లుగా ప్రకటించింది. మరిన్ని లాభాలు ఆర్జించడానికి, క్లిష్టమైన సమయంలో ప్రతిఒక్కరూ అమ్మకాలకు దోహదపడటం కొరకు డీలర్ నెట్‌వర్క్‌ని పెంపొందించుకోవాలని బ్రాండ్ భావిస్తోంది. 
 
ఈ పెరుగుదల 27, ఏప్రిల్ నుంచి తదుపరి నోటిస్ వరకు కొనసాగుతాయి. ఒకినోవాకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 350కు పైగా డీలర్‌షిప్‌ల సేల్స్ నెట్‌వర్క్ ఉంది. డీలర్ మార్జిన్‌ల్లో పెరుగుదల వల్ల డీలర్‌కు ప్రతి వాహనం విక్రయంపై రూ. 2000 వరకు అదనంగా మార్జిన్ లభిస్తుంది. మొత్తం మీద, ఇది డీలర్‌లకు పెద్దమొత్తంలో లాభాన్ని అందిస్తుంది. ఉదాహరణకు, ఒక డీలర్ నెలలో 100 వాహనాలు విక్రయించినట్లయితే, అతడు రూ. 2,00,000 కంటే ఎక్కువగా అదనపు లాభాన్ని పొందుతాడు.
 
డీలర్ మార్జిన్‌ల గురించి  షౌండర్ & ఎమ్‌డి శ్రీ. జితేందర్ శర్మ మాట్లాడుతూ “దేశం ఒక క్లిష్టమైన సమయంలో సాగుతోందని మేం అర్థం చేసుకున్నాం. ఈ సమయంలో, ప్రతిఒక్కరూ సాధ్యమైనంత వరకు ప్రతిక్కరికి సులభతరం చేయడానికి ప్రతిఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంది. మా డీలర్‌ పార్టనర్‌లు నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌లు మరియు ఒకినోవా ఎల్లప్పుడూ వారి కొరకు నిలబడి ఉంటుంది. ఈ వాగ్ధాన్ని బలోపేతం చేయడానికి, ఒకినోవా నేడు డీలర్‌ల మార్జిన్‌ల్లో వృద్ధిని ప్రకటించింది. చాలా పరిశ్రమలు చాలా నెమ్మదించడంతో ఇది డీలర్‌లకు ఒకవిధమైన ఉద్దీపనాన్ని కలిగిస్తుందని మేం ఆశిస్తున్నాం అని అన్నారు.