గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 19 జులై 2024 (18:25 IST)

అవసరమైన ఉపశమనం కోసం నెబులైజర్‌లను ఉపయోగించాలని OMRON హెల్త్‌కేర్ ప్రచారం

image
OMRON హెల్త్‌కేర్ కార్పొరేషన్ జపాన్ యొక్క అనుబంధ సంస్థ, హోమ్ హెల్త్ మానిటరింగ్ పరికరాలను అందించటం ద్వారా ప్రసిద్ధి చెందిన ప్రముఖ సంస్థ, OMRON హెల్త్‌కేర్ ఇండియా, సమర్థవంతమైన రీతిలో ఔషదాలు పనిచేయటం ద్వారా శ్వాసకోశ సమస్యలను అధిగమించటానికి, ముఖ్యంగా పిల్లలలో వ్యాధి నిర్వహణను మెరుగుపరచడానికి విస్తృత శ్రేణిలో నెబులైజర్‌లను కలిగి ఉంది. ఊపిరితిత్తుల మందులను త్వరగా అందజేయడంలో ఖచ్చితత్వం కారణంగా, ఆస్తమా- COPD మొదలైన శ్వాసకోశ వ్యాధుల నిర్వహణలో ముఖ్యమైన పాత్రను నెబులైజర్‌లు పోషిస్తాయి.
 
OMRON హెల్త్‌కేర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తెసుయా యమాడా మాట్లాడుతూ, “తీవ్రమైన వాయు కాలుష్యం, ఇతర కారణాల వల్ల దాదాపు 100 మిలియన్ల మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో మాత్రమే పెరుగుతున్న ఆస్తమా సంబంధిత మరణాల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. 1990లో, ఆస్తమాతో మరణించిన వారి సంఖ్య దాదాపు 150,000, కానీ ఇప్పుడు అది 200,000 దాటింది, పెరుగుతూనే ఉంది.." అని అన్నారు. 
 
ఆయనే మాట్లాడుతూ "నెబులైజర్‌లు లాంటి అధిక-నాణ్యత పరికరాలతో, ఖచ్చితత్వం, సౌలభ్యాన్ని అందించడం ద్వారా OMRON మా "గోయింగ్ టు జీరో" మిషన్‌కు అనుగుణంగా శ్వాస రుగ్మతలు లేని ప్రపంచాన్ని సృష్టించడానికి కుటుంబాలను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది" అని అన్నారు.