గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (10:51 IST)

విశాఖపట్నం నుంచి విజయవాడకు కొత్త విమాన సర్వీసులు

flight
విశాఖపట్నం నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అక్టోబర్ 27న కొత్త విమాన సర్వీసును ప్రారంభించనున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి విజయవాడకు నేరుగా ఒక విమానం మాత్రమే అందుబాటులో ఉంది.  
 
ఈ సేవ అంతంతమాత్రంగానే అందుబాటులోకి రావడంతో ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు తరచూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ఎయిర్‌ ప్యాసింజర్స్‌ అసోసియేషన్‌ చేసిన అభ్యర్థన మేరకు ఈ నెల 27 నుంచి అదనపు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇంకా, హైదరాబాద్, అహ్మదాబాద్‌లకు కొత్త విమాన సర్వీసులు అక్టోబర్ 29 నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం టిక్కెట్ విక్రయాలు జరుగుతున్నాయి.