ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఓయోలో భారీ కుదుపులు...600 మంది తొలగింపు

oyo hotel
మల్టీ నేషనల్ కంపెనీ (ఎంఎన్సీ)లలో మాత్రమే కాకుండా, దేశీయ కంపెనీల్లో కూడా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఇందులోభాగంగా ఫుడ్ డెలివరీ యాప్‍‌ జొమాటో, బైజూస్ వంటి కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. తొలి విడతలో 600 మంది ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది.
 
అదేసమయంలో రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ టీమ్‌లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్టు తెలిపింది. పైగా, తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు వైద్య బీమా కొనసాగిస్తామని పేర్కొంది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపడితే తొలిగించిన ఉద్యోగులకే తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. తొలగించనున్న ఉన్న ఉద్యోగుల్లో టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన ఉద్యోగులు ఉన్నారు.